కొప్పెర్ల పార్వతమ్మ జాతరలో లోకం మాధవి
నెల్లిమర్ల (విజయనగరం-న్యూస్ తెలుగు) : నెల్లిమర్ల నియోజకవర్గ పూసపాటిరేగ మండలం కొప్పెర్ల గ్రామంలో శ్రీశ్రీశ్రీ పార్వతమ్మ అమ్మవారి జాతర సందర్భంగా నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ లోకం మాధవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మహా అన్నదాన కార్యక్రమం తమ సొంత ఖర్చులతో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సుమారు 3000 మంది వరకు హాజరై అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా లోకం మాధవి మాట్లాడుతూ అమ్మవారి జాతర సందర్భంగా నియోజకవర్గ, జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వస్తారని ఉద్దేశంతో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అమ్మవారి భక్తులు అందరికీ మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ అన్నదాన కార్యక్రమం చేయడం మాకు దేవుడు ఇచ్చిన వారమని ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన గ్రామ ప్రజలకు, ఆలయ సిబ్బందికి, జనసేన నాయకులు, జన సైనికులకు మరియు వీర మహిళలకు ఎల్లవేళలా అమ్మ వారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. (Story: కొప్పెర్ల పార్వతమ్మ జాతరలో లోకం మాధవి)
See Also:
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!