జాబ్ మేళా నిర్వహణలో 32 మంది ఎంపి
పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ వెంకట సురేష్ బాబు
నైపుణ్యాభివృద్ధి ప్లేస్మెంట్ అధికారి తేజ్ కుమార్సి
డాప్- డిప్టిఎమ్ నారాయణస్వామి.
న్యూస్ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జరిగిన జాబ్ మేళాలో 32 మంది వివిధ కంపెనీలకు ఎంపిక కావడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ జేవి. సురేష్ బాబు, నైపుణ్యాభివృద్ధి ప్లేస్మెంట్ అధికారి కే. తేజ్ కుమార్, షిడాపు-డిపిటిఎమ్ నారాయణస్వామి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ధర్మవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకుల కొరకు ఈ జాబ్ మేళాను నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఎంప్లాయిమెంట్, చిట్అప్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళాను నిర్వహించామని తెలిపారు. ఇందులో పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిప్లమా, డిగ్రీ, పీజీ పూర్తి చేసి 18 నుండి 35 సంవత్సరాల లోపు ఉన్నవారు అందరూ పాల్గొనడం జరిగిందన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనలో ధర్మవరం నియోజకవర్గంలో జాబ్ మేళాను నిర్వహించుట మాకెంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. ఈ జాబ్ మేళాలో 59 మంది ఇంటర్వ్యూలకు హాజరుకాగా అందులో 32 మందిని వివిధ కంపెనీలకు ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ఎంపికైన వారికి నెలకు 15వేల రూపాయల నుండి 25 వేల రూపాయల వరకు జీతం ఉంటుందని తెలిపారు. ఉద్యోగాలకు ఎంపికైన వారు హైదరాబాదు, బెంగళూరులో ఉద్యోగము చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఎంపికైన 32 మందికి వారు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ సిల్క్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సిబ్బంది, సి డాప్ సిబ్బంది, ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ తో పాటు కళాశాల సిబ్బంది కూడా పాల్గొనడం జరిగిందని తెలిపారు.(Story:జాబ్ మేళా నిర్వహణలో 32 మంది ఎంపి )