డంపింగ్ స్థలాన్ని పరిశీలించిన మున్సిపల్ కమిషనర్
న్యూస్ తెలుగు /వినుకొండ : స్థానిక మార్కాపురం రోడ్ లో పసుపులేరు బ్రిడ్జి నందు ఉన్న డంపింగ్ స్థలం నందు లెగసీ వేస్ట్ ట్రీట్మెంట్ జరిగే తీరును ఎమెల్యే జి వి ఆంజనేయులు సూచన మేరకు వినుకొండ పట్టణ మునిసిపల్ కమీషనర్ సుభాష్ చంద్రబోస్ పరిశీలించారు. అనంతరం డంప్ సైట్ నిర్వహణ పేలవంగా ఉన్నదని, డంపింగ్ స్థలం పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని, మున్సిపాలిటీ డ్రైవర్స్ డంపింగ్ స్థలం కు వెళ్లే దారులలోనే చెత్తను వదులుతున్నారని డంప్ సైట్ లోపలి ప్రాంతంలో డంప్ చేసేలాగా చూసుకోవాలని సూచించారు. నెలకు ఒకమారు డంపింగ్ స్థలం లో వచ్చే చెత్తను జేసీబీ సాయంతో గుట్టలుగా ఏర్పాటు చెయ్యాలని సూచించారు. పట్టణ అరటిపండ్ల వ్యాపారస్తులు తమ అరటిబోదెల్ని పట్టణ శివారు రహదారుల ఇరువైపులా పారవేయకుండా పల్నాడురోడ్ నందు ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మానేజ్మెంట్ ప్లాంట్ నందు విండ్రోస్ అనే పద్ధతి ద్వారా ఎరువు తయారీ చెయ్యడానికి ఇవ్వాలని, అలాగే మెడికల్ షాప్ యజమానులు అవుట్ డేటెడ్ మెడిసిన్స్ ను ఎక్కడ పడితే అక్కడ రోడ్స్ పై పారవేయకుండగా సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నియమాల ప్రకారమే నిర్వహణ చెయ్యాలని హెచ్చరించారు. (Story : డంపింగ్ స్థలాన్ని పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ )