డబుల్ బెడ్రూం పేరిట కాసుల కక్కుర్తి..!
– బీఆర్ఎస్ పాలనలో ‘డబుల్’అక్రమాలు
– అక్కన్నపేట ఠాణాలో బాధితుడి ఫిర్యాదు
న్యూస్ తెలుగు/సిద్ధిపేట జిల్లా ప్రతినిధి (నారదాసు ఈశ్వర్): నిరుపేదలకు గూడు కల్పించాలన్న లక్ష్యంతో గత సర్కార్ తీసుకొచ్చిన డబుల్ బెడ్రూం పథకం సిద్దిపేట జిల్లాలో అబాసుపాలైంది. అవినీతి అక్రమాలకు కేరాఫ్ గా మారింది.గతంలోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు మధ్య దళారులు కలిసి నిబంధనలను తుంగలో తొక్కిపట్టి లక్షల్లో కొల్లగొట్టినట్లు సర్వత్రా ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.తాను గ్రామ ప్రథమ పౌరుడిగా ప్రజలకు నిజాయతీగా సేవలందించాల్సిన తానే అక్రమ వసూళ్ళకు తెరలేపారు.వివరాల్లోకి వెళ్ళితే సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల పరిధిలోని జనగామ గ్రామానికి చెందిన పూదరి కృష్ణహరి గౌడ్ నుంచి డబుల్ బెడ్రూం, బోరుబావి పేరిట రూ.లు 40 వేలు అక్రమ వసూళ్లకు పాల్పడిన ఆ గ్రామ మాజీ సర్పంచ్ బొడ్డు ఈశ్వర్,నాటి పాలకవర్గంలో వున్న వార్డు సభ్యుడు పూదరి పర్శరాములుపై సిద్దిపేట జిల్లా అక్కన్నపేట పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు కృష్ణహరి గౌడ్ తెలిపారు. పేదలకు దక్కాల్సిన డబుల్ బెడ్రూంల వ్యవహారంలో డబ్బుల గోల్మాల్ చేశారన్న సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.కాలయాపన చేస్తూ బాధితుడి ని ఇబ్బందులకు గురిచేయడంతో ఈ తంతు జనగామ గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది. దీనిపై ఉన్నతాధికారులు తగు విచారణ చేసి న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని బాధితుడు వూదరి కృష్ణహరి గౌడ్ తన గోడు వెల్లబో సుకున్నాడు.ఏది ఏమైనా మంత్రి పొన్నం ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ నియోజకవర్గంలో ఈ తరహా అక్రమాల పర్వానికి ఇకనైన అడ్డుకట్ట వేస్తారా లేదా చూడాలి మరీ..! (Story : డబుల్ బెడ్రూం పేరిట కాసుల కక్కుర్తి..!)