దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలి
న్యూస్‌తెలుగు/ విజయనగరం : దివ్యాంగులు, కుష్టు వ్యాధిగ్రస్తులు సామాజికంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో రాణించాలని విభిన్నప్రతిభావంతులు సంక్షేమ శాఖ జిల్లా ఎ.డి జీవీబీ జగదీష్ అన్నారు. గురువారం లెప్రసీ మిషన్ 150 సంవత్సరాలు పూర్తెన సందర్భంగా హీల్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో దివ్యాంగులు, లెప్రసీ వ్యాధిగ్రస్తులతో చాంపియన్ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏడి జగదీష్ మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. వాటిని ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే లెప్రసీ వ్యాధిగ్రస్తులు, దివ్యాంగులకు ప్రభుత్వం పింఛన్ సదుపాయాన్ని కల్పిస్తోందన్నారు. హీల్ ప్రాజెక్ట్ మేనేజర్, కో ఆర్డినేటర్లు కిస్మత్ నందా, తాలాడ దీప్తి లు మాట్లాడుతూ కుష్టు తోడ్పాటు అందించాలన్న ఉద్దేశంతో లెప్రసీ మిషన్ స్థాపించడం జరిగిందని నేటికి ఈ సంస్థ 150 సంవత్సరాలు పూర్తి చేసుకుందన్నారు. కుష్టు వ్యాధిగ్రస్తులు సమాజంలో గౌరవప్రదంగా జీవించేందుకు లెప్రసీ మిషన్ సంస్థ తోడ్పాటు అందిస్తోందన్నారు. వీరు సామాజిక ఆర్థికంగా ఎదిగేందుకు, జీవనోపాధి కల్పించేందుకు చేతి వృత్తులపై ఉచితంగా శిక్షణ అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా డి ఎం ఎన్ ఓ అధికారిణి అర్చన, హ్యూమన్ రైట్స్ అద్యక్షులు సత్తి అచ్చి రెడ్డి, హెల్పింగ్ హేండ్స్ హిజ్రాల సంక్షేమ సంఘం అద్యక్షులు కొండబాబు, సీడీపీఓ వంశీ, సిబ్బంది పాల్గొన్నారు.(Story: దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలి)