2 నుండి శ్రీ దుర్గాభవానీ శరన్నవరాత్రోత్సవాలు
– ఉత్సావాల కరపత్రాలను ఆవిష్కరించిన పురాణం మహేశ్వర శర్మ
26కెఎన్‌టి76 ః నవరాత్రోత్సవాల కరపత్రాలను ఆవిష్కరిస్తున్న ఆలయ ధర్మాధికారి, వేదపండితులు పురాణం మహేశ్వర శర్మ
న్యూస్‌తెలుగు/విద్యానగర్(కరీంనగర్) : త్రిమూర్తులకు శక్తి ప్రదాత. త్రిలోకేశ్వరి సకలాభీష్ట ప్రదాయిని శ్రీదుర్గాభవానీ శరన్నవరాత్రోత్సవాలు అక్టోబర్ 2 బుధవారం నుండి 13 ఆధివారం వరకు కరీంనగర్ మండలం నగునూర్‌లోని పరివార సమేత శ్రీదుర్గాభవానీ దేవాలయంలో నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మాధికారి, వేదపండితులు పురాణం మహేశ్వర శర్మ తెలిపారు. గురువారం «శరన్నవరాత్రులకు సంబంధించిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. అనంతరం నవరాత్రోత్సవాల కార్యక్రమాల గురించి వివరించారు. నవరాత్రులలో భాగంగా 2వ తేది బుధవారం ఉదయం 5.30కి అమ్మవారికి విశేష ద్రవ్య ఫలపంచామృత మహాభిషేకాలు, విశేష హారతులు, ద్వజారోహణతో ఉత్సవాలు ఆరంభమై 3వ తేది గురువారం ఉదయం 6.30కి గురు వందనం, గోపూజ, పుణ్యాహవాచనం, గ్రహారాధన, కలశస్థాపన, చండీపారాయణ చతుష్టష్యుపచారపూజ, చండీహోమం, మంగళహారతి, కన్యాసువాసినీ పూజలు జరుగుతాయని ఆయన తెలిపారు. ఆమ్మవారు బ్రహ్మీ అలంకరణలో హంస వాహనంపై భక్తులకు దర్శనమిస్తారని సాయంత్రం బతుకమ్మ, పల్లకీ సేవ, కోలాటం, రాజోపచార పూజలు జరుగుతాయని ఆయన తెలిపారు. 4న మహేశ్వరీ అలంకరణలో నంది వాహనంతో, 5న కౌమరీ అలంకరణలో నెమిలి వాహనంతో, 6న వైష్టనీ అలంకరణలో గరుడ వాహనంతో, 7న లలిత త్రిపుర సుందరిగా కామేశ్వరుడి వాహనంతో, 8నఇంద్రాణి అలంకరణలో ఐరావత వాహనంతో, 9న సరస్వతీ అలంకరణలో హంస వాహనంతో, 10న దుర్గా అలంకరణలో సింహావాహనంతో, 11న అన్నపూర్ణ అలంకరణలో, 12 శనివారం విజయలక్ష్మి అలంకరణలో గజవాహనంతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని, చండీహోమం మహాపూర్ణాహుతి , సాయంత్రం దసరా వేడుకలు, జమ్మిపూజ, రాంలీల జరుగుతుందని ఆయన వివరించారు. 13 ఆదివారం అర్ధనారీశ్వర అలంకరణలో నంది, సింహ వాహనలతో అమ్మవారు దర్శనమిస్తారని, ఉదయం 11 గంటలకు దుర్గాభవానీ సందరేశ్వరుల పట్టాభిషేకం, రథోత్సవం జరుగుతుందని ఆయన తెలిపారు. నవరాత్రులలో ప్రతి రోజు ఉదయం చండీహోమం, శ్రీచక్రపూజ, చతుష్టష్ట్యుపచార పూజ, విశేష హారతి, పూర్ణాహుతి, కుంకుమార్చనలు, చండీపారాయణం, సహస్ర నామర్చన తదితర పూజలు జరుగుతాయని ఈ ఉత్సావాలలో భక్తులు పాల్గోని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. కరపత్రాల ఆవిష్కరణలో ఆలయ వ్యవస్ధాపక అధ్యక్షులు వంగళ లక్ష్మన్, ఆలయ కమిటి ప్రధాన కార్యదర్శి వేములవాడ ద్రోణాచారి, కమిటి బాధ్యులు నీరుమల్ల తిరుపతి, శానగొండ మధుసూదన్, బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి బాధ్యులు రాచమల్ల ప్రసాద్, పల్లెర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గోన్నారు.(Story:2 నుండి శ్రీ దుర్గాభవానీ శరన్నవరాత్రోత్సవాలు)