ఘనంగా మైనార్టీ సంక్షేమ దినోత్సవ వేడుకలు
ఎం ఎం డి ఏ
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ముస్లిం మైనార్టీ డెవలప్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు యం.యం.డి.ఇమామ్ ఆదేశాల మేరకు పట్టణము లోనికోట ప్రభుత్వ మున్సిపల్ హైస్కూల్ నందు మైనార్టీ వెల్ఫేర్ డే సందర్భంగా ముస్లిం మైనారిటీ డెవలప్ మెంట్ అసోషియేషన్ (యం.యం.డి.ఏ) ఆధ్వర్యంలో ” మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ 137వ జయంతి ,జాతీయ విద్యా దినోత్సవం” వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో కలసి కేక్ కట్ చేయించి మిఠాయిలు పంచి శుభాకంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యం.యం.డి.ఏ. నాయకులు మాట్లాడుతూ భారతదేశ మొదటి కేంద్ర విద్యాశాఖ మంత్రి అయిన మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి వేడుకలు విద్యార్థులతో కలిసి జరుపుకోవడం సంతోషం అన్నారు. ప్రతి ఒక్కరు బాగా చదువుకోవాలని అలాగే మౌలానా అబుల్ కలామ్ చూపిన బాటలో నడుస్తూ ఆయన ఆశయాలను కొనసాగిద్దామని తెలిపారు. అబ్దుల్ కలాం ఆజాద్ జీవితం అందరికీ ఆదర్శమని, వారు విద్యావేత్త స్వాతంత్ర సమరయోధుడు అని తెలిపారు. విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి ఆజాదుకు నివాళులు అర్పించారు. మౌలానా అబ్దుల్ కలాం భారతదేశ తొలి విద్యామంత్రిగా పనిచేస్తూ విద్యా విధానంతో పాటు దేశ అభివృద్ధికి ఎంతో తోడ్పడడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు సయ్యద్ రోషన్ జమీర్, ధర్మవరం నియోజకవర్గం అధ్యక్షుడు సయ్యద్ దాదా పీర్, ధర్మవరం అధ్యక్షులు ముల్లా ఫారూఖ్, మదీనా మసీదు కమిటీ సభ్యులు ఇనాయతుల్లా, శామీర్, ఇలియాజ్, జిక్రీయా,ఖాదర్ వలీ, అప్సర్ మరియు స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. (Story : ఘనంగా మైనార్టీ సంక్షేమ దినోత్సవ వేడుకలు)