UA-35385725-1 UA-35385725-1

యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి 

యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి 

డ్రగ్స్  వ్యతిరేక పోరాటంలో వారియర్ గా పోరాడాలి

ములుగు పోలీస్ వారి ఆధ్వర్యంలో జిల్లా యువతకు వాలీబాల్ పోటీలు

జిల్లా ఎస్పీ డా.శబరీష్

న్యూస్ తెలుగు /ములుగు : జాకారం నందు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో భాగంగా మంగళవారం ములుగు జిల్లా పోలీస్ వారి ఆధ్వర్యంలో యువతకు జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలను నిర్వహించడం జరిగినది. ఈ పోటీలకు ప్రతి మండలం నుండి గెలుపొందిన టీంలను తీసుకోవడం జరిగినది.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరు అయిన జిల్లా ఎస్పీ మాట్లాడుతూ
గ్రామీణ ప్రాంతాలలో గల యువత యొక్క నైపుణ్యం ప్రపంచానికి తెలియాల్సి ఉందని, ఆటలను ఉల్లాసానికేకాకుండా, భవిష్యత్తుగా కూడా తీసుకోవాలన్నారు.జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో మంచి ప్రతిభ కనబరిచిన వారికి రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్నత స్థాయి ఉద్యోగాల లో అవకాశాలు కూడా కల్పించడం జరిగినదని తెలిపారు.
ములుగు జిల్లా యువతను పోలీస్ శాఖ తరఫున కోరేది ఒకే విషయమని, మీ మీ గ్రామాలలో గంజాయిని అమ్మేవారు లేదా సేవించేవారు, ప్రభుత్వ స్థలాల్లో లేదా బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించేవారు ఉంటే వారి సమాచారాన్ని స్థానిక ఎస్సై సీఐ అధికారులకు అందజేయాలన్నారు.
పోటీలో ఒక జట్టు గెలవాలంటే ఆ జెట్టులోని సభ్యులందరూ కలిసికట్టుగా ఏలా పోరాడుతారో, ఈ డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టాలంటే యువత,ప్రజలు, పోలీస్ ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పోరాడుతేనె విజయం సాధించగలుగుతామన్నారు.డ్రగ్స్ మహమ్మారి ఎందరో జీవితాలను నాశనం చేస్తుందని దేశానికే వెన్నెముక అయిన యువతను కబలిస్తున్న ఈ డ్రగ్స్ ను నిర్మూలించడంలో ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు.
డ్రగ్స్ అమ్మే వారి పైన అత్యంత కఠినంగా వ్యవహరించబడుతుందని” తెలియక డ్రగ్స్ సేవించేవారు ఉంటే, వారిని పునరావాస కేంద్రాలకు తరలించి, వారికి కౌన్సిలింగ్ ఇప్పించడం జరుగుతుందని పేర్కొన్నారు.మీ పరిసరాలలో డ్రగ్స్ అమ్మేవారు సేవించేవారి వివరాలు తెలిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100 కు ఫోన్ చేసి తెలుపగలరని మీ వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడతాయని ప్రభుత్వం తరఫున నగదు రివార్డును అందజేస్తామని ఎస్పీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఓ ఎస్ డి ములుగు మహేష్ బిగితే ఐపీఎస్ అదనపు ఎస్పీ ఏ ఆర్ సదానందం ములుగు డిఎస్పి రవీందర్ డి.సి.ఆర్.బి డి.ఎస్.పి రాములు సీఐ ములుగు సి ఐ పస్రా సిఐ వెంకటాపురం జిల్లాలోని పలువురు ఎస్ఐలు పాల్గొన్నారు. (Story : యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి )

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1