సీజన్ వ్యాధులపట్ల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి
న్యూస్ తెలుగు /ములుగు : ములుగు జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్. అప్పయ్య, మంగళవారం రాయిని గూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అబ్బాపురం గ్రామంలోనీ ,ఆవాసాలు అయినా బాణాలపల్లి, కుమ్మరపల్లి ,శ్రీరాములపల్లి లలో ఎనిమిది(8) మంది డాక్టర్లతో మెగా హెల్త్ క్యాంప్ ను నిర్వహించడం జరిగిందని,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య తెలిపారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ రణధీర్ ,ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ప్రసాద్ ,ఏ ఎం ఓ దుర్గారావు లతో ,గ్రామాలలో వాడవాడకు ,ఇంటింటికీ సందర్శించి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా, మురికి నీరు నిల్వ ఉండ కుండ చూడాలని, నీటి నిల్వలలోని లార్వాను చూపిస్తూ ,వీటి ద్వారానే మలేరియా డెంగ్యూ మొదలగు సీజనల్ వ్యాధులు వస్తున్నాయని తెలిపారు., పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమతెరలు వాడాలని, ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పించారు. మెగా వైద్య శిబిరానికి 363 ఓపి, 16 మంది జ్వర పీడితుల వారికి , మలేరియా ,డెంగ్య ఆర్ .డి .టి టెస్టులు చేయడం జరిగింది. వైద్య శిబిరానికి వచ్చిన మిగతా రోగులకు , బీపీ, షుగర్ వంటి పరీక్షలు చేసి తగిన మందులు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రణధీర్, మెడికల్ ఆఫీసర్ ప్రసాద్ డాక్టర్ ప్రేమ్ సింగ్, డాక్టర్ దీపిక, డాక్టర్ దీప్తి, డాక్టర్ నవ్యరాణి ,డాక్టర్ శ్రవణ్, డాక్టర్ నందకిషోర్, జితేందర్, డాక్టర్ నవ్యశ్రీ, దుర్గారావు, గ్రామ ప్రజాప్రతినిధులైన నల్లిల ఆనంద్ ,కైదిరి మొగిలి నాగు బాపూరావు ,చదువు రాంరెడ్డి, జైపాల్ రెడ్డి , ఆరెంధుల కుమారస్వామి, గ్రామ యువకులు మరియు గ్రామస్తులు తోపాటు, గ్రామ కార్యదర్శి యాదవరాజు, హెల్త్ సూపర్వైజర్స్ హెల్త్ అసిస్టెంట్ ఏ. యన్. ఎం లు, ఆశా కార్యకర్తలు (Story : సీజన్ వ్యాధులపట్ల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి)