దసరా మహోత్సవాల్లో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలి
నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
న్యూస్ తెలుగు/విజయవాడ : రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున దసరావ ఉత్సవాలకు నగరానికి వచ్చే యాత్రికులకు ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు, లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్‌ఎం.ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. దసరా ఉత్సవాలకు చేపట్టాల్సిన ఏర్పాట్లులో భాగాంగా పద్మావతి ఘాట్, కృష్ణవేణి ఘాట్, సీతమ్మ పాదాలు, పున్నమి ఘాట్, భవాని ఘాట్, గిరి ప్రదక్షిణ ప్రాంతాల్లో సోమవారం పర్యటించి ఆయా ఏర్పాట్లును పరిశీలించారు. శరన్నవరాత్రులకు నగరపాలక సంస్థ ఏర్పాటు చేయాల్సిన క్లోక్ రూమ్, తాత్కాలిక మరుగుదొడ్లు, త్రాగునీరూ, పారిశుధ్య నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. క్లాక్ రూమ్ ఏర్పాటు చేస్తున్న ప్రాంతాలు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్న ప్రదేశాలు, వాటి నిర్వహణ, ప్రజలకు త్రాగునీటి సౌకర్యం కల్పిస్తున్న ప్రాంతాలు, భవాని భక్తుల రెడ్ క్లాత్ కొరకు ఏర్పాటు చేయాల్సిన కన్వీనర్ బెల్ట్ తదితర అంశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎలాటి అసౌకర్యం కలగకుండా వారి సౌకర్యార్థం 9 ప్రాంతాల్లో 150 తాత్కాలిక మరుగుదొడ్లు, 6 క్లాక్ రూమస్, 25 ప్రాంతాల్లో త్రాగున్నీరు ఏర్పాటు, 1100 పారిశుధ్య కార్మికులతో పారిశుధ్య నిర్వహణ చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ చీఫ్ మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్లు పాల్గొన్నారు. (Story : దసరా మహోత్సవాల్లో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలి)