త్రిలింగ క్షేత్రం, గిరి ప్రదక్షణకు ప్రత్యేక బస్సులు ఏర్పాట్లు
డిపో మేనేజర్ సత్యనారాయణ
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ఏపీఎస్ఆర్టీసీ సంస్థ ధర్మవరం డిపో ద్వారా త్రిలింగ చైత్ర దర్శనము, గిరి ప్రదక్షణ కోసం ప్రత్యేక బస్సులను నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్రిలింగ క్షేత్ర దర్శనంలో ప్రతి వారములో సోమవారము నాడు అనంతపురం డిపో నుండి త్రిలింగ చైత్ర దర్శనమునకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి సోమవారం ఉదయం 5 గంటలకు బయలుదేరి బుగ్గ రామలింగేశ్వర స్వామి, యాగంటి, మహానంది పుణ్యక్షేత్రాలను దర్శించుకొని తిరిగి అదే రోజు రాత్రి ధర్మవరం చేరుకోవడం జరుగుతుందని తెలిపారు. పెద్దలకు 640 రూపాయలు, 12 సంవత్సరాల లోపు పిల్లలకు 335 రూపాయలు చార్జీలు ఉంటాయని తెలిపారు. రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పించబడిందని తెలిపారు. ఈనెల 11, 18, 25వ తేదీలలో బస్సులో వెళ్లే అవకాశం ఉందని తెలిపారు. ఆన్లైన్ ద్వారా కూడా రిజర్వేషన్ చేసుకునే అవకాశం కలదు అని తెలిపారు. ఓ పి పి ఆర్ ఎస్/ఏటిబి ఏజెంట్ ద్వారా కూడా ముందుగా టికెట్లు బుక్ చేసుకుని అవకాశం ఉందని తెలిపారు. అదేవిధంగా అరుణాచలం వెళ్లే భక్తాదులకు కూడా కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి ఆదివారము రాత్రి 8 గంటలకు ధర్మారం నుండి బయలుదేరి తిరిగి సోమవారం రాత్రి అరుణాచలంలో బయలుదేరుతుందని తెలిపారు. సూపర్ లగ్జరీ బస్సులో చార్జీ 1400, ఎక్స్ప్రెస్ లో 1100 రూపాయలు ఉంటుందని తెలిపారు. ఈనెల 10వ,17వ, 24వ తేదీలలో అరుణాచలం కు వెళ్లే సౌకర్యం కూడా కల్పించడం జరిగిందని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని భక్తాదులు సద్వినియోగం చేసుకొని ఆర్టీసీ సంస్థకు ఆదాయం తెచ్చే విధంగా సహకరించాలని వారు తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 6303151302 కు గాని, 9959225859 (Story : త్రిలింగ క్షేత్రం, గిరి ప్రదక్షణకు ప్రత్యేక బస్సులు ఏర్పాట్లు)