UA-35385725-1 UA-35385725-1

రెండ్రోజుల్లో అంతా శుభ్రం చేస్తాం

రెండ్రోజుల్లో అంతా శుభ్రం చేస్తాం

• రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత
• 54, 56 డివిజన్లలో మాజీ ఎంపీ కొనకళ్లతో కలిసి వరద బాధితులకు మంత్రి పరామర్శ
• ఎస్వీఆర్ స్కూల్లో ఫైరింజన్ తో శుభ్రం చేసిన మంత్రి

న్యూస్‌తెలుగు/అమరావతి : రెండ్రోజుల్లో ఇళ్లు, వీధులు, షాపులు…అన్నీ శుభ్రం చేస్తామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత తెలిపారు. ఆదివారం విజయవాడ నగరంలో 54, 56 డివిజన్లలో మాజీ ఎంపీ కొనకళ్ల సత్యనారాయణతో కలిసి పర్యటించారు. ముందుగా ఆమె 54 వ డివిజన్ పాత రాజరాజేశ్వరిపేటలో ఇంటింటికీ వెళ్లి వరద బాధితులను పరామర్శించారు. ఆర్ఆర్ పేట మెయిన్ రోడ్డు, రెడ్డికొట్టు స్ట్రీట్, కొత్త మసీద్ రోడ్డు, పాత మసీదు రోడ్డు, సాయిబాబా గుడి వీధి, బీరువాల కంపెనీ రోడ్డు, అమరావతి నగర్ ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అందజేసిన ఆహార పొట్లాలు, పాలు, నీరు పంపిణీ చేశారు. ఆర్ ఆర్ పేట రెండో లైన్ లో ట్యాంకర్ ద్వారా తాగునీటిని మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి బాధితులతో మాట్లాడారు. ప్రభుత్వం అందజేస్తున్న ఆహార పానీయాలు అందుతున్నాయా..? అని అడిగి తెలుసుకున్నారు. కొంతమంది బాధితుల ఇళ్లల్లోకి వెళ్లి మంత్రి సవిత పరిశీలించారు. బాధితులే స్వయంగా ఇళ్లు శుభ్రంగా చేసుకోవడాన్ని గమనించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ… బాధితులెవరూ ఆందోళ చెందాల్సిన అవసరంలేదని, ప్రభుత్వమే ఇళ్లు, వీధులు కూడా శుభ్రం చేస్తుందని తెలిపారు. రెండ్రోజుల్లో వీధుల్లో చెత్త చెదారం తొలగించడంతో పాటు ఫైరింజన్ల సాయంతో రోడ్లను శుభ్రం చేయనున్నామని తెలిపారు. ఇదే విషయమై ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. అనంతరం మార్క్ ఫెడ్ ఎండీ మనజీర్ జిలానీ సమూన్, ఆ డివిజన్ స్పెషలాఫీసర్ రామసుందర్ రెడ్డి తో మాట్లాడారు. వరద బాధితులకు అందుతున్న సాయంపై అడిగి తెలుసుకున్నారు. ఒకవైపు ఆహార పదార్థాలు అందిస్తూనే మరోవైపు పారిశుధ్యం పనులు పెద్ద ఎత్తున చేపట్టాలని సూచించారు. పాత ఆర్ఆర్ పేటలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని మంత్రి సవిత పరిశీలించారు. ఏయే మందులు పంపిణీ చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. అంటు వ్యాధులు ప్రబలకుండా, మెరుగైన వైద్య సేవలు అందించాలని అక్కడి వైద్య సిబ్బందిని ఆదేశించారు.
*చంద్రబాబుపై ప్రశంసల వెల్లువ
రేయింబవళ్లు కష్టపడుతూ, తమకోసం సీఎం చంద్రబాబు పడుతున్న కష్టాన్ని చూసి పాత ఆర్ఆర్ పేట వాసులు తమ దు:ఖాన్ని సైతం పక్కనపెట్టి, ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంటింటికీ వచ్చి… అన్నీ అందుతున్నాయా…? అని ఆరా తీస్తున్న మంత్రి సవితతో వరద బాధితులు తమ ఆనందాన్ని పంచుకున్నారు. తమ కోసం 70 ఏళ్ల వయస్సులోనూ సీఎం చంద్రబాబు పడుతున్న కష్టాన్ని వారు కొనియారు. తమ కష్టం కన్నా చంద్రబాబు పడుతున్న కష్టమే ఎక్కువన్నారు. ఆహారం, పాలు, నీరు…అన్నీ సమయానికి అందిస్తున్నారన్నారు. కొంతమంది ముస్లిం సోదరులు మంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. తక్కువ సయమంలో భారీ విపత్తు నుంచి రక్షించిన చంద్రబాబుకు వారు కృతజ్ఞతలు. ఇదే మాట ప్రతి ఇంటా… ప్రతి వారి నోటా, ప్రతి వీధిలోనూ వినిపించడంపై మంత్రి సవిత సహా సాయానికి వెళ్లిన అందరూ సంతృప్తి వ్యక్తంచేశారు.
స్కూల్ ను శుభ్రం చేసిన మంత్రి
54వ డివిజన్ వించిపేట, నిజాంపేట సెంటర్, పంజా సెంటర్, గాంధీ బొమ్మ సెంటర్ లో మాజీ ఎంపీ కొనకళ్ల సత్యనారాయణతో కలిసి మంత్రి సవిత పర్యటించారు. ముందుగా విద్యాంజలి స్కూల్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పరిశీలించారు. ఎస్వీఆర్ మెమోరియల్ స్కూల్ ను సందర్శించారు. ఫైరింజన్ సాయంతో మట్టితో నిండిన స్కూల్ ను మంత్రి సవిత శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆ స్కూల్ యాజమాన్యం మంత్రికి ధన్యవాదాలు తెలిపింది. తాము సొంతంగా అయితే స్కూల్ ను ఇప్పట్లో శుభ్రం చేయడం సాధ్యం కాదన్నారు. ప్రభుత్వం సాయం వల్లే తక్కువ సమయంలో పాఠశాలను శుభ్రం చేసుకోగలిగామన్నారు. అనంతరం మాజీ ఎంపీ కొనకళ్ల సత్యనారాయణతో కలిసి పలు షాపుల యజమానులు, తోపుడు బండ్ల వ్యాపారులను మంత్రి కలిశారు. ప్రభుత్వం తీసుకున్న తక్షణ చర్యలతో వరద ముంపు నుంచి త్వరగా బయటపడ్డామని, వ్యాపారాలు కూడా చేసుకుంటున్నామని వ్యాపారులు ఆనందం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఫతుల్లా అహ్మద్ , ఎంఎస్.బేగ్, అజీర్, షేక్ ఆషా తదితరులు పాల్గొన్నారు. (Story : రెండ్రోజుల్లో అంతా శుభ్రం చేస్తాం)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1