ఘనంగా జరిగిన వినాయక చవితి వేడుకలు
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్యసాయి జిల్లా) : పట్టణంలోని 40 వార్డులలో అత్యంత వైభవంగా వినాయక ప్రతిష్టించి, అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. ఇందులో భాగంగా పట్టణంలోని పేరు బజారులో గల ఆర్యవైశ్య కొత్త సత్రంలో ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో పది అడుగుల మట్టి వినాయకుని కాళీయ మర్దనం ఆకారంలో భక్తాదులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా యువజన సంఘం అధ్యక్షులు దేవత శ్రీనివాస్ కార్యదర్శి మోకా రవి మాట్లాడుతూ దాతల సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరము ఈ వినాయక చవితి వేడుకలను నిర్వహిస్తున్నామని, సోమవారం నిమజ్జనం నిర్వహిస్తామని తెలిపారు. ఈ విగ్రహాన్ని తిలకించడానికి భక్తుల అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం ఉపాధ్యక్షులు నిరంజన్, మురళి, రంజిత్, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
రాంనగర్లో వినాయక చవితి వేడుకలు:: పట్టణంలోని కొత్తపేటలోని రామ్ నగర్ లో గల రామాలయం దగ్గర శ్రీ కోదండ స్వామి భజన బృందం వారిచే అయోధ్య రామాలయం గణపతి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు అని దాసరి హరి, రాఘవ, లక్ష్మయ్య, రామయ్య, చంద్ర వారి మిత్రబృందం తెలిపారు. అయోధ్య ఆకారంలో వినాయకుడు ప్రతిష్టించిన వైనం భక్తాదులను విశేషంగా ఆకట్టుకుంది. (Story : ఘనంగా జరిగిన వినాయక చవితి వేడుకలు)