పెబ్బేరు సంత స్థలం పరిశీలించిన అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు
న్యూస్‌తెలుగు/వనపర్తి : పెబ్బేరు సంత స్థలం అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు పరిశీలించారు.
సంత స్థలం కాపాడడానికి అందరూ రాజకీయాలకు అతీతంగా ఏకమై ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అవసరమైతే మూడునాళ్ళ ముచ్చటైన మీ, మీ పదవులకు రాజీనామాలు చేయాలని చైర్మన్,వైస్ చైర్మన్ , కౌన్సిలర్లు అందరికీ ఐక్యవేదిక పిలుపునిచ్చారు.
నిజానిజాలను ప్రజలకు అర్థం చేయించాలనే ఉద్దేశంతో పెబ్బేరు పట్టణానికి వచ్చి సంతస్థలం పరిశీలించి దాని పూర్వాపరాలు అన్ని కూడా ప్రజలకు నాయకులకు వివరించారు. వేలమంది జీవనాధారం, లక్షల మంది వ్యాపారం చేసుకునే పెబ్బేరు సంతను ప్రజలకు అంకితం చేయడానికి జిల్లా కలెక్టర్ , ఎమ్మెల్యే , ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ , మాజీలు అందరూ ఏకమై యజమానులతో మాట్లాడి ప్రజలకు చెందేలా చేయాలని అఖిలపక్ష ఐక్యవేదిక డిమాండ్ చేశారు. ఈ మధ్యన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జిలు ఇచ్చిన పిలుపు మేరకు చట్టాలతో చేయలేనివి సయోద్యతో చేయొచ్చు అని పిలుపునిచ్చారు. ఎక్కడో భూత్పూర్ దగ్గర ఉన్న కర్వేన ప్రాజెక్టు లో పొలం పోయిందని వనపర్తి కలెక్టర్ ఆఫీస్ సమీపంలో అతి విలువైన 24 ఎకరాలు రామారావు అనే వ్యక్తికి కట్టబెట్టారు. మరి వేల కుటుంబాలు ఈ సంత స్థలం పై ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. వారికి సంత స్థలం ఇవ్వడానికి ఏమి చేయాలి? ఆలోచించాలని, దానిపై రాద్ధాంతం చేయకుండా అవతలి వారితో హైకోర్టు తీర్పు ద్వారా వారి సూచన మేరకు మాట్లాడి రాజీ మార్గంలో సాధించాలని మాత్రమే మేము వేడుకుంటున్నాం.
అంతిమంగా సంతస్థలాన్ని ప్రజలకు, సంత వ్యాపారస్తులకు స్వంతం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. దీనిపై ఇప్పటి వరకు స్పందించని అధికారులకు ప్రజాప్రతినిధులకు హెచ్చరికలు చేస్తున్నాం. దీనిపై పెబ్బేరు కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు ముందుకు వస్తే నేను ఆమరణ నిరాహారదీక్షకు వారితోపాటు సిద్ధమవుతానని సతీష్ యాదవ్ పిలుపుఇచ్చారు. మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు సతీష్ యాదవ్ తో పాటు బి.ఎస్.పి నాయకులు, టిడిపి, కాంగ్రెస్ , టిఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు. (Story : పెబ్బేరు సంత స్థలం పరిశీలించిన అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు)