పేద ప్రజలకు సేవ చేయడమే మానవతా సంస్థ యొక్క ముఖ్య కర్తవ్యం..
సెంట్రల్ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు రామచంద్రారెడ్డి.
జిల్లా చైర్మన్ రఘునాథ్.
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా):పేద ప్రజలకు సేవ చేయడమే మానవతా సంస్థ యొక్క ముఖ్య కర్తవ్యం అని సెంట్రల్ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు రామచంద్రారెడ్డి, జిల్లా చైర్మన్ రఘునాథ్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎన్జీవో హోం లో ధర్మవరం పట్టణం మానవతా సంస్థ యొక్క నూతన కమిటీ కార్యవర్గానికి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అనంతరం ప్రస్తుత కమిటీ సంవత్సరం పాటు చేసిన సేవలను వారు కొనియాడారు. అనంతరం నూతన కమిటీ కూడా అందరి సహాయ సహకారాలు, సలహాలు, సూచనలతో ముందుకు వెళ్లి, పేద ప్రజలకు సేవ చేయాలని తెలిపారు. నూతన కమిటీని ప్రస్తుత అధ్యక్షులు తల్లం నారాయణమూర్తి ఆధ్వర్యంలో కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ కమిటీ 2024 సెప్టెంబర్ నెల నుండి 2025 జూన్ నెల వరకు పని చేస్తారని తెలిపారు. నూతన కమిటీలో ధర్మవరం మానవతా సంస్థ చైర్మన్గా తరలం నారాయణమూర్తి, అధ్యక్షులుగా చిన్న తంబి చిన్నప్ప, కార్యదర్శిగా సిఎస్ మంజునాథ్, ఉపాధ్యక్షులుగా జగ్గా వేణుగోపాల్, సహాయ కార్యదర్శిగా టి. రామకృష్ణ, కోశాధికారిగా తల్లా చంద్రశేఖర్, ముఖ్య సలహాదారునిగా జింక చిన్నప్ప తో పాటు డైరెక్టర్గా రామకృష్ణ, సాయి ప్రసాద్, రాంప్రసాద్, నరసింహారెడ్డి, ఆంజనేయ చౌదరి, విజయ్ భాస్కర్, నారాయణరెడ్డి, మనోహర్ గుప్తా, గట్టు వెంకటేష్, జక్కా నాగరాజు రచయిత ప్రమాణస్వీకారం ను చేయించారు. నూతన కార్యవర్గం వారు మాట్లాడుతూ అందరి సహాయ సహకారాలతో, సలహాలు సూచనలు తీసుకొని, దాతల తో ప్రజా సేవా కార్యక్రమాలను విస్తృత పరుస్తామని తెలిపారు. అనంతరం నూతన కమిటీ వారికి అభినందన శుభాకాంక్షలు అందరూ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ డైరెక్టర్లు రాతల గోపి, రామానుజుల రెడ్డి, పాత కమిటీ కార్యవర్గం, తదితరులు పాల్గొన్నారు.(Story:పేద ప్రజలకు సేవ చేయడమే మానవతా సంస్థ యొక్క ముఖ్య కర్తవ్యం.. )