UA-35385725-1 UA-35385725-1

ప్రభుత్వం మారిన పాలన తీరు మారలేదా..?

ప్రభుత్వం మారిన పాలన తీరు మారలేదా..?

కబ్జా అయిన ప్రభుత్వ భూమి విముక్తి కలిగేనా..?

న్యూస్‌తెలుగు/ చాట్రాయి : ప్రభుత్వం మారిన పరిపాలన తీరు మారలేదా….? కృష్ణారావు పాలెం లో వైసీపీ పాలనలో కబ్జా అయిన ప్రభుత్వ భూమికి ఇకనైనా విముక్తి కలుగుతుందా….? లేదా….? వైసిపి ప్రముఖ నేత అండదండలతో ప్రభుత్వ భూమి పూర్వపు స్మశాన వాటికను నూజివీడు కు చెందిన ఒక వ్యక్తి ఆక్రమించుకొని తీగ రాయి ఏసుకున్న పట్టించుకునే వారే లేకుండా పోతున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో ఉన్న చాట్రాయి మండలం కృష్ణారావు పాలెం లో విజయవాడ సత్తుపల్లి ప్రధాన రహదారి పక్కన ప్రభుత్వ భూమిని నూజివీడు కు చెందిన ఒక వ్యక్తి అప్పట్లో అధికార పార్టీ నాయకులను ,అధికారులకు వశపరచుకొని లక్షలాది రూపాయల లంచాలు ముట్టజెప్పి 25 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అనుకున్న ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని ముళ్ళ తీగ వేసి సాగు చేసుకుంటున్నా గ్రామస్తులు స్థానికులు ఫిర్యాదు చేసిన అధికారులు కన్నెత్తి చూసే పాపాన పోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.

గ్రామంలో మచ్చ ప్రవీణ్ అను వారికి సర్వే నెంబర్లు 51-8 ,51-7, 51-6,లలో సుమారు 5 ఎకరాల 40 సెంట్లు భూమి వుంది. ఆ భూమి లోపలికి వెళ్ళడానికి దారి లేదు. దాని పక్కన మెయిన్ రోడ్డు పక్కన షుమారు 75 సెంట్ల ప్రభుత్వ భూమివుంది దానిలో గతంలో స్మశాన వాటిక వుండేది. సర్వే నెంబర్ 51/9 వుంది. చాట్రాయి తహసిల్దార్ జగన్నాథరావు పని చేసిన కాలంలో 25మంది పేదవాళ్ళకు ఇళ్ళ స్తలాలు లే అవుట్ కు ఒక ప్రయత్నం జరిగింది.ఇదే భూమిని గ్రంధాలయం కట్టడం కోసం ,ప్రభుత్వ హాస్పటల్ భవన నిర్మాణ కోసం పరిశీలించారు. ఆతరువాత అదే భూమిని కబ్జా చేస్తే అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ప్రధాన రహదారి పక్కన ప్రభుత్వ భూమిని ప్రభుత్వ అధికారులే ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారా అని పెద్ద ఎత్తున అప్పట్లో చర్చలు జరిగాయి.తహశీల్దారు విశ్వనాథరావు వచ్చిన తరువాత పలువురు ఫిర్యాదు చేయగా , మండల సర్వేరు, వీఆర్వో ల తో కలిసి పరిశీలించి ప్రభుత్వ భూమి అని నిర్ధారించారు . ఆతర్వాత చర్యలు తీసుకోలేదు అప్పట్లో వైసీపీ నేతల అండతో ఈ భూమిని కబ్జా చేసి కంచి వేసారని పెద్ద ఎత్తున ఆరోపణలు వినవచ్చాయి . స్మశాన వాటిక తొలగించి 75 సెంట్లు ప్రభుత్వ భూమికి కంచి వేసిన ప్రైవేటు వ్యక్తుల భూములకు దారులు వేసుకున్న అధికార పార్టీ నాయకులు మాటలు విని రెవెన్యూ అధికారులు ఈ కబ్జా సంగతి మర్చిపోయారని ఆరోపణలు వచ్చాయి.ఆభూమికి కంచి వేసి మొక్కజొన్న సాగు చేసుకుంటూ వెనుక వున్న ప్రవేటు భూములకు దారి వేసుకుని దర్జాగా అనుభవిస్తూ భూమి వెనక భాగంలో ఉన్న చెరువు భూమి సర్వే నెంబర్ 56/2లో మొత్తం ఐదు ఎకరాల 44 సెంట్లు చెరువు వుండగా దానిలో ప్రస్తుతం మచ్చ ప్రవీణ్ దీనిలో సుమారుగా రెండు ఎకరాలు కబ్జా చేశారని పలువురు అంటున్నారు. నేటి వరకు ప్రభుత్వం మారినా పాలన తీరు మారలేదని ఇకనైనా అధికారులు జోక్యం చేసుకొని కబ్జా చేసిన ప్రభుత్వ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. (Story : ప్రభుత్వం మారిన పాలన తీరు మారలేదా..?)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1