శ్రీ వీరభద్ర స్వామి వారి ఆలయం పూన నిర్మాణం
న్యూస్‌తెలుగు/వనపర్తి : పెబ్బేరు మండలం సూగూరు గ్రామంలో సంస్థాన కాలంలో నిర్మించిన శ్రీ వీరభద్ర స్వామి వారి ఆలయం శిథిలావస్థకు చేరుకునందున గ్రామస్తుల నిర్ణయం మేరకు పూన నిర్మాణం చేపట్టిన సందర్భాన గడప (దర్వాద) ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. పూజారులు కౌడీణ్య ,మధుసూదన్ గారు పూజా కార్యక్రమాలు నిర్వహించినారు. పూజ కార్యక్రమాల్లో పాల్గొన్న బునాదిపూర్ గ్రామస్తుడు ప్రవీణ్ టీచర్ గారు వారి పుత్రిక చేతుల మీదుగా గుడి నిర్మాణం కోసం తన స్థోమతుకు తగ్గ నగదును విరాళంగా అందించడం జరిగిందని శ్రీవారి సేవకులు సితార వెంకటేశ్వర్లు తెలిపినారు. గ్రామస్తులతో పాటు, వివిధ గ్రామాలకు సంబంధించిన భక్తులు,హిందూ బంధువులు ఇట్టి కార్యక్రమాలో బాగస్వాములై నగదు,వస్తు, రూపేణ విరివిగా విరాళాలు అందించి శ్రీ వీరభద్ర స్వామి వారి కృప కటాక్షాలు పొందాలని శ్రీవారి సేవకులు సితార వెంకటేశ్వర్లు గారు విజ్ఞప్తి చేసారు.ఇట్టి పూజ కార్యక్రమాల్లో ఆలయ కమిటీ సభ్యులు,జయన్న శెట్టి, మాధవుడు, వెంకటేష్ సాగర్,రాములు , అయ్యలు,గోపాల్, వెంకటేశ్వర్లు,వెంకటయ్య, వేణుగోపాల్, మేస్త్రి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. (Story : శ్రీ వీరభద్ర స్వామి వారి ఆలయం పూన నిర్మాణం)