Home వార్తలు తెలంగాణ అమ్మాయిలు ఒకరిపై ఆధారపడకుండా తమ కాళ్లపై తాము నిలబడాలి

అమ్మాయిలు ఒకరిపై ఆధారపడకుండా తమ కాళ్లపై తాము నిలబడాలి

0

అమ్మాయిలు ఒకరిపై ఆధారపడకుండా తమ కాళ్లపై తాము నిలబడాలి

న్యూస్‌తెలుగు/వనపర్తి : అమ్మాయిలు లక్ష్యంతో చదువుకొని ఒకరిపై ఆధారపడకుండా తమ కాళ్లపై తాము నిలబడాలని జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యులు సయ్యద్ సహజాది ఉద్బోధించారు.
బుధవారం వనపర్తి జిల్లా పర్యటన సందర్భంగా ఉదయం పట్టణంలోని మైనారిటీ గురుకుల బాలికల పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో ఉన్న మౌలిక వసతులు, విద్యార్థుల నమోదు పరిశీలించి విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ అమ్మాయిలు ఎందులోనూ తక్కువ కాదని, ఏ సమస్య వచ్చిన ఇంకొకరిపై ఆధారపడకుండా ధైర్యంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఉద్బోధించారు. అది పాఠశాల నుండే ప్రారంభం కావాలని, ఏమైన సమస్యలు ఉంటే ధైర్యంగా ప్రశ్నించాలని సూచించారు. అందుకు తన జీవిత అనుభవాలను ఉదాహరణగా తెలియజేశారు. తాను నిరుపేద కుటుంబం నుండి వచ్చానని, మహిళల హక్కులు, మహిళా సాధికారత కొరకు కృషిచేయడం జరుగుతుందన్నారు.
మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల భవనం శిధిలావస్థలో ఉందని సాధ్యమైనంత త్వరగా ఇక్కడి నుండి మార్చాల్సిన అవసరం ఉందని ఆర్.ఎల్.సి. కిరణ్మయిని ఆదేశించారు.
ఆర్డీఓ పద్మావతి, డిఎస్పీ వెంకటేశ్వర్లు, ఆర్.ఎల్.సి. కిరణ్మయి, ప్రిన్సిపాల్ సౌమ్య , జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ హవిల రాణి, ఉపాద్యాయులు, విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు. (Story : అమ్మాయిలు ఒకరిపై ఆధారపడకుండా తమ కాళ్లపై తాము నిలబడాలి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version