నిలిచిన ఈవిఎం పరిశీలన
న్యూస్‌తెలుగు/విజయనగరం ; విజయనగరం పార్లమెంటు స్థానంలో వైకాపా అభ్యర్ధిగా పోటీ చేసిన బెల్లాన చంద్రశేఖర్ చేసిన ధరఖాస్తు మేరకు, ఈవిఎం పరిశీలనకు ఎన్నికల సంఘం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు బెల్లానకు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నుంచి నోటీసు ఇవ్వగా, ఆయన మంగళవారం ఉదయం 10 గంటలకు నెల్లిమర్ల ఈవిఎం గోదాములవద్దకు చేరుకున్నారు. తాను ఎంపిక చేసుకున్న పోలింగ్ కేంద్రం కంట్రోల్ యూనిట్ బ్యాటరీ పవర్ పర్సంటేజ్‌ను ఆయన అడిగారు. అయితే ఈసిఐ ప్రస్తుత టెక్నికల్ ఎస్ఓపిలో బ్యాటరీ పవర్ పర్సంటేజ్ లేదని భెల్ ఇంజనీర్లు, అధికారులు వారికి తెలియజేశారు. దీంతో ఈవిఎం పరిశీలనకు బెల్లాన నిరాకరించినందువల్ల, ఈవిఎం పరిశీలన జరగలేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక ప్రకటనలోతెలిపారు. (Story : నిలిచిన ఈవిఎం పరిశీలన)