జెఎన్ టియుజివి లో వర్క్ షాప్
న్యూస్‌తెలుగు/విజయనగరం : స్థానిక జే ఎన్ టి యు జి వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో “కాన్సెప్ట్యువల్ లెర్నింగ్ టెక్నిక్ ” అనే అంశంపై వర్క్‌షాప్ ఏర్పాటు చేయబడినది. ఈ వర్క్‌షాప్ నకు రిసోర్స్ పర్సన్ గా ప్రొఫెసర్ జాస్తి ఆనంద్ చందూలాల్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తాము చేసే పనిలో సమగ్రత పాటించవలసినదిగా సూచించారు. మనం చేసే పనిని మనం పూర్తిగా తెలుసుకున్నప్పుడే అందులో నిపుణత సాధించగలమని, ఒక వ్యక్తి ఒక విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్నప్పుడే తాను చేసే పనిలో ప్రగతిని సాధించగలరని తెలిపారు ప్రస్తుత సమాజంలో ఉన్న అనేక సమస్యలు అవగాహన లోపం వలన ఏర్పడుతున్నాయని, విద్యార్థులు తమ చదువు పట్ల సమగ్రమైన అవగాహన పెంపొందించుకోవాలన్నారు .తద్వారా తాము చేసే పనిలో నిపుణత సాధించగలరని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమములో కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆర్. రాజేశ్వరరావు,
వైస్-ప్రిన్సిపాల్ డాక్టర్ జి.జె.నాగరాజు, వివిధ విభాగాల అధిపతులు,
జెఎన్ టియుజివి పరిధిలో గల వివిధ ఇంజనీరింగ్ కళాశాలల నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు హాజరయ్యారు. (Story : జెఎన్ టియుజివి లో వర్క్ షాప్ )