UA-35385725-1 UA-35385725-1

ఇది ప్రజా ప్రభుత్వం

ఇది ప్రజా ప్రభుత్వం

బిఆర్ఎస్ వాళ్లను నమ్మి రోడ్లు ఎక్క వద్దు

రుణమాఫీ అయిన బి ఆర్ ఎస్ నాయకులే రోడ్డు ఎక్కి ధర్నాలు చేస్తున్నారు.

ప్రజలకు అందుబాటులోనే ప్రభుత్వం పనిచేస్తుంది.

రుణమాఫీ విషయంలో అందరికీ సమన్యాయం జరుగుతుంది.

ప్రతి ఒక్క కుటుంబానికి 2 లక్షల వరకు రుణమాఫీ తప్పకుండా జరుగుతుంది..

రుణమాఫీకి కట్టుబడి ఉన్నాం

18వేల కోట్లు మాఫీ చేశాం
ఇంకో12కోట్లు కూడా ప్రభుత్వం మాఫీచేస్తాం. వెంకన్న, రఘు బాబు

న్యూస్ తెలుగు /ఏటూరునాగారం :
తెలంగాణా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి,స్త్రీ-శిశు,సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ దనసరిఅనసూయ(సీతక్క) అదేశాలమేరకు,జిల్లా అధ్యక్షులు-పైడాకుల అశోక్ సూచనలమేరకు,
ఏటూరు నాగారం మండల కేంద్రంలో శనివారం బస్టాండ్ ఆవరణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన, మాట ప్రకారం, రెండు లక్షల రుణమాఫీ చేయడంతో మండల అధ్యక్షుడు చిటమట రఘు ఆధ్వర్యంలో
రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి,పార్టీ శ్రేణులు నాయకులు. యువకులు. మహిళలు అందరితో తమ ఆనందాన్ని పంచుకుంటూ రుణమాఫీ సంబరాలను భాణ సంచాలు కాల్చుతూ జరుపుకున్నారని, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కమిటీ అధ్యక్షులు ఇర్స వడ్ల వెంకన్న, ఏటూరునాగారం మండల కమిటి అధ్యక్షులు చిట్ట మోట రఘు బాబు తెలిపారు.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చిత్రపటాలకు ఘనంగా పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న, మండల అధ్యక్షులు చిట మోట రఘు బాబు, మైనార్టీ సెల్ అధ్యక్షులు అయుబ్ నాయకులు జిల్లా ఉపాధ్యక్షులు ఖలీల్. గుడ్ల దేవేందర్ .ముక్కెర లాలయ్య. మహిళా నాయకురాలు రాధిక
యూత్ నాయకులు గౌస్ పాషా,సర్వ అక్షిత్. గద్దల నవీన్ లు మాట్లాడుతూ
,కాంగ్రేస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2 లక్షల రుణమాఫీ ని చేస్తుండగా,ఇప్పటికి పలు దఫాలుగా రుణమాఫీ చేసిన ప్రభుత్వం,మళ్ళీ మిగతా రుణమాఫీ కానీ కుటుంబాలకు చేస్తామని మాట ఇవ్వడం జరిగిందన్నారు.
2 లక్షల వరకు రుణమాఫీ కానీ వారు కూడా ఏదైనా సమస్య ఉంటే,కలెక్టర్ ని కూడా కలిసి సమస్యలు చెప్పుకునే విధంగా తగిన ఏర్పాట్లు చేస్తామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారని పేర్కొన్నారు.
కానీ,ఇప్పుడు రుణమాఫీ అయిన బి ఆర్ ఎస్ నాయకులు రోడ్డు ఎక్కి ధర్నాలు,రాస్తారోకోలు చేస్తున్నారని,కానీ,మీరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ,ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఉన్నదని,
,ప్రజలు ఈ తప్పుడు మాటలు నమ్మవద్దు,ప్రభుత్వం ఎల్లప్పుడూ తోడుగా ఉండి, సమన్యాయం చేకూర్చుతుంది అనీ అన్నారు. గత ప్రభుత్వం పది సంవత్సరాలలో చేసిందేమిటి, ఒకేసారి రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని,
కొన్ని సాంకేతిక కారణాలు ఉన్నాయాని, ఆధార్ లో తప్పులు దొరల దొర్లడం జరుగుతుందన్నారు.మోసగాళ్ల మాటలతో మోసపోకండి రైతులారా, రుణమాఫీ కాకుంటే స్థానికంగా ఉన్న మమ్మల్ని సంప్రదించాలని, రైతులకు విజ్ఞప్తి చేశారు.మేము అధికారుల దగ్గరికి తీసుకొని వెళ్లి, సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని, లేదా ఆఫీసర్లను నేరుగా మీరే కలవండని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో ఇచ్చిన, హామీలన్నీ కూడా నెరవేస్తుందని, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారికి, ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు,అనుబంధసంఘాల నాయకులు,యూత్ నాయకులు పత్రికా-మీడియా సోదరులు కార్యకర్తలు, తదితరులు పాల్గొని విజయవంతం చేయడం జరిగిందని వారు పేర్కొన్నారు.(Story :ఇది ప్రజా ప్రభుత్వం)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1