ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కారించాలి
జిల్లా ఇంచార్జి అదనపు కలెక్టర్
న్యూస్ తెలుగు /ములుగు జిల్లా బ్యూరో (వై. లకుమయ్య ) : సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్డిఓ సత్యపాల్ రెడ్డి తో కలసి ఇంచార్జి అదనపు కలెక్టర్ సంపత్ రావ్ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, తమ శాఖకు సంబంధించి వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని, తిరస్కరించిన వాటికి పుర్తిసమచారంతో వివరణ ఇవ్వాలని జిల్లా అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న అధికారులు జిల్లా వైద్య అధికారి అప్పయ్య, డి సి ఓ సర్దార్ సింగ్, జిల్లా వ్యవసాయ అధికారి సురేష్ కుమార్, జిల్లా పశువైద్యశాల అధికారి కొమురయ్య, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి ప్రకాష్, జిల్లా సివిల్ సప్లై్ మేనేజర్ రాంపతి, యస్ సి కార్పొరేషన్ అధికారి, తూల రవి, బి. సి వెల్పర్ అధికారి, సి హెచ్. రవీందర్ రెడ్డి, డిప్యూటీ ఇన్స్పెక్టర్ సర్వే అధికారి, రాజనర్సయ్య, జిల్లా ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. (Story : ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కారించాలి)