UA-35385725-1 UA-35385725-1

ఈ ఏడాది 7 లక్షల ఇళ్ళు నిర్మించాలన్నది లక్ష్యం..

ఈ ఏడాది 7 లక్షల ఇళ్ళు నిర్మించాలన్నది లక్ష్యం..

* రానున్న వంద రోజుల్లో 1.55 లక్షల ఇళ్ళు నిర్మించేందుకు చర్యలు
* 2029 నాటికీ ఇళ్లులేని ప్రతి పేదవానికి పక్కాగృహం నిర్మిస్తాం
* కాలనీలలో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం
* రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్ధ సారథి

న్యూస్‌తెలుగు/ఎన్టీఆర్ జిల్లా : పేదలకు మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం బాధ్యత రాహిత్యం కారణంగా సుమారు 4 వేల 500 కోట్ల రూపాయల నిధులు ఇతర అవసరాలకు వినియోగించడం జరిగిందన్నారు. పేదవాని సొంతింటి కల కలగానే మిగిలిపోయిందని ఈ ఏడాది ఏడు లక్షల ఇళ్లను నిర్మించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికతో ముందుకు వెళ్తుందని కాలనీలలో అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి తెలిపారు.

ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గాజుల పేట లేఅవుట్, ఈలప్రోలు వద్ద నిర్మిస్తున్న పక్కా గృహాలు లేఅవుట్, జి కొండూరు లేఅవుట్ మైలవరం మండలం పురాగుట్ట లేఅవుట్ లను గురువారం రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధ సారథి స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్, గృహ నిర్మాణ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ అజయ్ జైన్ లతో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ 2016 నుండి ఇప్పటివరకు పేదలకు 21 లక్షల గృహాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. పేదవానికి సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎంఏవై పథకం ద్వారా పక్కా గృహాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. గృహాలను నిర్మించుకోవడంలో లబ్ధిదారులుకు పూర్తి సహాయ సహకారాలు అందించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిన కారణంగా కేవలం 6.8 లక్షల ఇళ్ళను మాత్రమే నిర్మాణాలను పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గృహ నిర్మాణాలను పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. రాష్ట్ర్ర వ్యాప్తంగా కాలనీల ద్వారా నిర్మిస్తున్న గృహాలను 2025 నాటికీ పూర్తి చేయాలన్నా సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. పేదలకు అవసరమైన సహాయ సహకారం అందించి నిర్మాణాలను వేగవంతం చేయాలని అధికారులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలిచ్చామన్నారు.
పట్టాణ ప్రాంతాలలో అమృత్ నిధులు, గ్రామీణ ప్రాంతాలలో ఉపాధిహామీ జలజీవన్ మిషన్ నిధుల ద్వారా మౌలిక వసతులను కల్పించనున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకతతో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటుందని ఇళ్లులేని అర్హులైన సుమారు 11 లక్షల మంది పేదలకు ఇళ్లను నిర్మించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రసుత్తం పేదలకు మంజూరు చేసిన గృహాలను రానున్న మార్చి నాటికీ పూర్తి చేయకపోతే కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు విదులయ్యే అవకాశం ఉండదని దీనిని దృష్టిలో పెట్టుకొని ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టేందుకు లబ్ధిదారులు ముందుకు రావాలన్నారు. గృహ నిర్మాణ శాఖ అధికారులు ప్రతి కాలనీని క్షేత్రస్థాయిలో సందర్శించి గృహ నిర్మాణాలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని స్ఫష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. తాపీ మేస్త్రీలు మాటలకు లోనై అనవసరపు ఖర్చులను తగ్గించుకొని ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. ఇళ్ల మంజూరులో అర్హత లేనివారికి ఇళ్ల మంజూరు చేసినట్లు ఫిర్యాదులు వస్తున్నాయని వాటిపై పూర్తి విచారణ చేసి అనర్హులుగా గుర్తిస్తే కేటాయింపులో రద్దు చేస్తామని మంత్రి తెలిపారు. ఇబ్రహీంపట్నం, ఈలప్రోలు కాలనీలలో ఇళ్ల నిర్మాణంలో బేస్మెంట్ ని నింపుకునేందుకు స్థానిక శాసనసభ్యులు సహకారంతో విటిపిఎస్ ఫ్లైయాష్ ను లబ్దిదారులకు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. కాలనీలలో రోడ్ల పరిస్థితిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చి సిమెంట్ రోడ్లు నిర్మాణానికి నిధులు మంజూరు చేసేలా కృషి చేయనున్నట్లు మంత్రి కొలుసు పార్ధసారథి తెలిపారు.

మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష ప్రసాద్ మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం గాజులపేటలో 33 ఎకరాలలో 1406 గృహాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈలప్రోలు సమీపంలో 12.97 ఎకరాలలో 709 గృహాలు జి కొండూరు సమీపంలో 12.42 ఎకరాలలో 360 గృహాలు మైలవరం సమీపంలోని పురాగుట్ట వద్ద 33.85 ఎకరాలలో 1147 గృహాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. మంజూరైన గృహాలలో ఒక వంతు మాత్రమే పూర్తయ్యాయని మిగిలిన గృహాల నిర్మాణం చేపట్టేలా లబ్ధిదారులను ప్రోత్సహిస్తున్నామన్నారు. కాలనీలలో మౌలిక వసతులను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.

కాలనీ గృహ నిర్మాణ పరిశీలనలో మంత్రి వెంట గృహ నిర్మాణ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ అజయ్ జైన్, చీఫ్ ఇంజినీర్ జీవి ప్రసాద్, జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ రజిని కుమారి, డీఈ శ్రీనివాసరావు, ఏఈ సిహెచ్ నాగరాజు, కొండపల్లి మున్సిపల్ కమీషనర్ రమ్య కీర్తన, ఎంపీపీ పాలడుగు జ్యోత్స్న, స్థానిక నాయకులు జంపాల సీతారామయ్య, రామినేని రాజా, చెన్నుబోయిన చిట్టిబాబు, సిహెచ్ శ్రీనివాసరావు, డి. విజయలక్ష్మి, అక్కల గాంధీ లబ్ధిదారులు పాల్గొన్నారు. (Story : ఈ ఏడాది 7 లక్షల ఇళ్ళు నిర్మించాలన్నది లక్ష్యం..)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1