ఫోటోగ్రాఫర్ వంగపల్లి బ్రహ్మం కు జాతీయ స్థాయిలో పురస్కారం
న్యూస్‌తెలుగు/వినుకొండ /పల్నాడుజిల్లా : బ్రహ్మం తీసిన ఫోటోలకు FIP(ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫోటోగ్రఫీ )పాట్న వారు అత్యున్నత గౌరవ పురస్కారానికి ఎంపిక చేసారు. గిరిజనుల జీవన విదానంపై తీసిన ఛాయాచిత్రాలకు నలుపు తెలుపు విభాగం లో AFIP(హానరి )పురస్కారం లభించింది .
గిరిజనుల జీవన శైలి విధానంపై తీసిన ఛాయాచిత్రాలను గత నెల జులై 2024 లో పంపించారు వీటిని పరిచీలించిన న్యాయ నిర్ణేతలు బ్రహ్మం ను AFIP(అరిస్ట్) (పురస్కారానికి )ఎంపికయ్యారు అని FIP జనరల్ సెక్రటరీ Dr .B K SINHA ఈ మెయిల్ ద్వారా అభినందనలు తెలియచేసారు,kgl ఫంక్షన్ హల్ నందు జరిగిన జర్నలిస్ట్ ల ఆత్మీయ సమావేశంలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫోటోగ్రఫీ AFIP (ఆర్టిస్ట్ ) ఎంపికైనందున వంగపల్లి బ్రహ్మం ను వినుకొండ శాసనసభ్యులు జి వి అంజనేయలు,మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు ఘనంగా సన్మానించారు, ఫోట్కగ్రఫీ రంగం లో మన వినుకొండ ఖ్యాతిని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నిలిపారు, ఫోటోగ్రఫీలో అద్భుత ప్రతిభను కనబరిచినందుకు బ్రహ్మకు 5000 రూపాయలు నగదు పారితోషకం అందించారు, ఫోటోగ్రఫీ రంగంలో మునుముందు ఇంకా ఎన్నో అవార్డులు తీసుకోవాలని మక్కెన మల్లికార్జున రావు గారు ఆకాంక్షించారు.AFIP సాధించిన బ్రహ్మం ను పలువురు జర్నలిస్ట్ లు, ఫోటోగ్రాఫర్ కేసనపల్లి సుబ్బారావు,రాజవరపు ప్రకాష్,యార్లగడ్డ ఆజాద్, ఆచారి,లగడపాటివెంకట్రావు,సందు కొటేశ్వరరావు,యూసఫ్, నారాయణ,అంజి, తెప్పల శ్రీనివాసరావు, స్టీవెన్ ,అనిల్ ,నవీన్,పలువురుఅభినందనలు తెలియజేసారు. (Story : ఫోటోగ్రాఫర్ వంగపల్లి బ్రహ్మం కు జాతీయ స్థాయిలో పురస్కారం)