తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో చిరంజీవి
న్యూస్‌తెలుగు/తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని ప్రముఖ హీరో చిరంజీవి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుటుంబ సమేతంగా కలిసి గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి ఆలయ లాంచనాలతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలను నిర్వహించి స్వామి వారి ఆశీర్వాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కొండ్రెడ్డి రితేష్ కుమార్ రెడ్డి,ఆనం కైవల్యా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. (Story : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో చిరంజీవి )