ఎన్‌సిఎఫ్ మార్గదర్శకాలను ధృవీకరించిన లీడ్ గ్రూప్ సర్వే
న్యూస్‌తెలుగు/రంగారెడ్డి: భారతదేశంలోని పాఠశాల విద్య ప్రస్తుత స్థితిని విశ్లేషించే ‘ది పల్స్ ఆఫ్ స్కూల్ లీడర్స్ సర్వే’ అనే కొత్త అధ్యయనాన్ని, భారతదేశంలోని ప్రముఖ స్కూల్ ఎడ్‌టెక్ లీడ్ గ్రూప్ విడుదల చేసింది. ఈ అధ్యయనం వెల్లడిరచే దాని ప్రకారం, తమ విద్యార్థులకు మల్టీమోడల్ విద్యను అందించే పాఠశాలలు పాఠ్యపుస్తకాల వంటి సాంప్రదాయ రూపాలను మాత్రమే ఉపయోగించే పాఠశాలల కంటే మిన్నగా ఫలితాలను సాధించాయి. దాదాపు 1.7 లక్షల మంది విద్యార్థులకు ప్రాతినిధ్యం వహిస్తున్న 500కు పైగా ప్రైవేట్ పాఠశాలల రేటింగ్‌ల ఆధారంగా దేశవ్యాప్తంగా సర్వే జరిగింది. భావనాత్మక అంశాల పట్ల అవగాహన, విశ్వాసం, ఇంగ్లీష్ మాట్లాడటం, మొత్తంమీద విద్య నాణ్యత-అనే నాలుగు క్లిష్టమైన విద్యార్థుల అభ్యాస ఫలితాలపై పాఠశాలలను తమను తాము రేట్ చేయమని అడిగారు. చాలా పాఠశాలలు భావనాత్మక అంశాలపట్ల అవగాహన, మొత్తం నాణ్యతపై తమను తాము ఉన్నతంగా రేట్ చేసుకున్నప్పటికీ, విద్యార్థుల విశ్వాస స్థాయి, ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యాలలో మాత్రం అంతరాలు కనిపించాయి. (Story : ఎన్‌సిఎఫ్ మార్గదర్శకాలను ధృవీకరించిన లీడ్ గ్రూప్ సర్వే)