రూరల్ లో 95 శాతము పింఛన్ పంపిణీ
ఎంపీడీవో అబ్దుల్ నబీ
న్యూస్ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్యసాయి జిల్లా) : మండల పరిధిలోని గ్రామ పంచాయితీలలో గల గ్రామాలకు సచివాలయ ఉద్యోగుల ద్వారా మొత్తం 6, 866 మందికి ప్రభుత్వము నుండి 2 కోట్ల 99 లక్షల 42 వేల500 రూపాయలు రావడం జరిగింది. ఇందులో భాగంగానే ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పింఛన్లను పంపిణీ చేయగా 95 శాతం నమోదు కావడం జరిగిందని తెలిపారు. మిగిలిన వాటిని సోమవారం పూర్తి చేయడం జరుగుతుందని ఎంపీడీవో అబ్దుల్ నబీ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పింఛన్ పంపిణీ వ్యవస్థను కూడా తాను ఆకస్మికంగా పరిశీలించడం జరిగిందని, ఎక్కడ ఎటువంటి అవకతవకలు జరగలేదని వారు స్పష్టం చేశారు. (Story : రూరల్ లో 95 శాతము పింఛన్ పంపిణీ)