జర్నలిస్టు పిల్లలకు ఫీజు రాయితీ ఇవ్వండి
– కలెక్టర్ ను కోరిన వర్కింగ్ జర్నలిస్టులు
– ప్రైవేటు విద్యాసంస్థలు, జర్నలిస్టు ప్రతినిధులతో మీటింగ్ కు కలెక్టర్ ఆదేశం
న్యూస్‌తెలుగు/ బాపట్ల: జిల్లాలో వివిధ ప్రింట్ & ఎలక్ట్రాన్ మీడియా సంస్థలలో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టు కుటుంబాలలోని పిల్లలకు ప్రైవేట్ హై స్కూల్స్ , కాలేజీల్లో 50% ఫీజు రాయితీ మరియు 15% సీట్లు కేటాయింపు కు అవకాశం కల్పించాలని ఈరోజు బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో జిల్లా కలెక్టర్ జేవి మురళిని వర్కింగ్ జర్నలిస్టులు కలిసి వినత పత్రం అందజేశారు. జిల్లాలో వివిధ ప్రింట్ & ఎలక్ట్రాన్ మీడియా సంస్థలలో అనేకమంది పేద జర్నలిస్టు లు విధులు నిర్వహించుచున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఓబీసీ వర్గాలకు చెందిన జర్నలిస్టుల పిల్లలకు సీట్లు కేటాయింపుతో పాటు జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలలో రాయితీ ఇప్పించేందుకు చర్యలు చేపట్టవలసినదిగా వర్కింగ్ జర్నలిస్టులు కలెక్టర్ కోరారు. జిల్లాలోని జర్నలిస్టుల కుటుంబాల పిల్లలకు అక్రిడేషన్ ను ప్రామాణికం లేకుండా అందరు జర్నలిస్ట్ ల పిల్లలకు ప్రైవేటు స్కూల్స్, కాలేజీలలో జర్నలిస్టు పిల్లలకు రాయితీ కల్పించు విధంగా తగు చర్యలు చేపట్టి జిల్లాలోని జర్నలిస్టులకు సహాయ సహకారములు అందించమని వర్కింగ్ జర్నలిస్టులు కలెక్టర్లను కోరారు. వర్కింగ్ జర్నలిస్టుల అభ్యర్ధన మేరకు జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాలోని విద్యాసంస్థల ప్రతినిధులు మరియు ఎలక్ట్రాన్ అండ్ ప్రింట్ మీడియా ప్రతినిధులతో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి వర్కింగ్ జర్నలిస్టుల కుటుంబాలకు చెందిన పిల్లలకు ఫీజు మరియు సీట్లు కల్పించే విషయంలో సహకారం అందించే విధంగా తగు చర్యలు చేపడతామని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ ను కలిసిన వారిలో అఫీషియల్ మీడియా కోఆర్డినేటర్ ఎన్ నాగార్జున, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ధనరాజ్, నారాయణ, స్టాలిన్ , శ్రీకాంత్, విశాలాంధ్ర బ్యూరో ప్రశాంత్, గుమ్మడి సూర్యప్రకాష్, బొల్లాపల్లి బెన్ని బాబు, సిహెచ్ వి సుబ్బారావు, అనిల్ తదితరులు ఉన్నారు.