ప్రయాణికుల సమస్యను తక్షణమే పరిష్కరించాలి
డా” ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
న్యూస్‌తెలుగు/కాగజ్ నగర్ : కాగజ్ నగర్ మండలం వంజిరి గ్రామాన్ని బిఆర్ఎస్ నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సందర్శించారు. ఒకే ఒక రహదారి వర్షాల కారణంగా
రైల్వే అండర్ బ్రిడ్జి క్రింది తోవ మార్గం పూర్తిగా నీటితో నిండి పోయిందని గత 2 నెలలుగా వంజిరి గ్రామ ప్రజలు పలు మార్లు రాస్తారోకోలు ధర్నాలు చేసినా కూడా స్థానిక ఎమ్మెల్యే నుండి
ప్రభుత్వ అధికారుల నుండి స్పందన లేదని అన్నారు.రెండు వేల కుటుంబాలు ఉన్న
వంజిరి గ్రామ ప్రజలకు చిరు వ్యాపారులకు విద్యార్థినీ విద్యార్థులకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది.
కాగజ్ నగర్ పట్టణానికి కూత వేటు దూరంలో ఉన్న వంజిరి గ్రామమే ఈ దుస్థితి లో ఉంటే నియోజకవర్గం లోని మారుమూల ప్రాంతాల ప్రజల పరిస్థితి వర్ణణాతీతం గా ఉంది ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కాగజ్నగర్ పట్టణంలోని సంతోష్ ఫంక్షన్ హాల్ లో ప్రజా యుద్ధ నౌక గద్దర్ సంస్కరణ సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, మేధావులు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు. (Story : ప్రయాణికుల సమస్యను తక్షణమే పరిష్కరించాలి )