మాదక ద్రవ్యాలకి యువత దూరంగా ఉండాలి
సిటీయు వీసీ ఆచార్య తేజస్వి కట్టిమని
న్యూస్‌తెలుగు/విజయనగరం : మత్తు పదార్దాలు, మాదక ద్రవ్యాలవాడకం మరియు రవాణా చేయడం తీవ్రమయిన నేరమని అటువంటి వాటి జోలికి యువత ఆకర్షితులు కాకుండా ఉండాలని సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఆచార్య తేజస్వి కట్టిమని పిలుపునిచ్చారు.యూనివర్సిటీ ఇంటర్నల్ కాంప్లయింట్స్ కమిటీ ఆధ్వర్యం లో బుధవారం యూనివర్సిటీ ప్రాంగణం లో మాదకద్రవ్యాల వినియోగం అక్రమ రవాణా మరియు లైంగిక వేధింపుల యొక్క చట్టపరమైన అంశాలపై జరిగిన వర్కుషాపు లో భాగంగా ప్రొఫెసర్ టీవి కట్టిమని మాట్లాడుతూ యువత గంజాయి, కొకైన్, మధ్యం, సిగరెట్, గుట్కాలు తదితరమైన మత్తుపదార్ధాల వ్యాసనానికి గురి కాకుండా తమ దృస్టి ని చదువుపై కేంద్రీకరించి జీవితంలో ఉన్నతిని సాధించాలని పిలుపునిచ్చారు. అనంతరం సీనియర్ సివిల్ జడ్జ్, జిల్లా న్యాయ సేవా సమితి అద్యక్షురాలు కె విజయ కళ్యాణి మాట్లాడుతూ ర్యాగింగ్, ప్రేమ వ్యవహారాలు, మత్తు పదార్ధాల సేవనం మరియు రవాణా యువతను నిర్వీర్యం చేస్తున్నాయని అందువలన తమతమ లక్ష్యాలకు దూర మవ్వడమే కాకుండా తమ తల్లి తండ్రులను, కుటుంబాన్ని కూడా న్యాయ పరమైన సమస్యలలోకి నెడుతున్నారని ఇటువంటి విషయాలలో అప్రమత్తంగా ఉండాలని కోరారు. అనంతరం దిశ డిఎస్పీ డి.విశ్వనాధ్ మాట్లాడుతూ యువతీ తీవకులు చట్టపరమైన చిక్కులలో చిక్కకుండా ఏ విధంగా తమ జీవితాన్ని ఉన్నతంగా ఆదర్శవంతంగా మచి భవిష్యత్తు వైపు ఏవిధంగా మరల్చాలో వివరించారు. ఈ కార్యక్రమం లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్స్ వి ఎస్ ప్రసాద్, టూ టౌన్ సిఐ కె రామారావు, యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ తంత్రవాహి శ్రీనివాసన్, ప్రొఫెసర్ శరత్చంద్ర బాబు, ఐసిసి అద్యక్షురాలు డా. పరికిపండ్ల శ్రీదేవి, డా.అనిరుధ్ కుమార్, డా.దివ్య, డా. ప్రమా, డా. కుసుమ్, డాక్టర్ ఎన్ వి ఎస్ సూర్యనారాయణ తదితర అద్యాపకులు, ఆద్యాపకేతరులు, విద్యార్దులు పాల్గొన్నారు. (Story : మాదక ద్రవ్యాలకి యువత దూరంగా ఉండాలి )