ఇరిగేషన్ వ్యవస్థను విధ్వంసం చేసిన జగన్ రెడ్డి..
ఐదేళ్లలో కాలువలపై తట్ట మట్టి కూడా వేయని వైసిపి ప్రభుత్వం
ఇరిగేషన్ శాఖలో పెండింగ్లో 18 వేల కోట్లు బిల్లులు
ఎన్డీఏ రైతు సంక్షేమ ప్రభుత్వం
సమస్యలను అధిగమించి రైతును ఆదుకుంటాం
ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు
న్యూస్‌తెలుగు/ వినుకొండ :ఐదేళ్ల వైసిపి పాలనలో జగన్ రెడ్డి రాష్ట్రంలోని ఇరిగేషన్ వ్యవస్థను విధ్వంసం చేసి రైతును నట్టేట ముంచాడని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.
శ్రీశైలం వెళ్లి వస్తున్న మంత్రని మార్గమధ్యమైన చీకటి గలపాలెం అడ్డరోడ్డు వద్ద ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆధ్వర్యంలో రైతులు కలిశారు.
ఈ సందర్భంగా ఆయన గుండ్లకమ్మ నదిని పరిశీలించారు. అనంతరం మంత్రి రామానాయుడు విలేకరులతో మాట్లాడుతూ నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన 45 రోజుల్లో తాను ఉత్తరాంధ్ర పెన్నా రాయలసీమ అన్నిచోట్ల నేటి ప్రాజెక్టులను పరిశీలించడం జరిగిందన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి తాగునీటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది లేదని, సమస్యలు ఉన్నచోట కనీసం మరమ్మత్తులకు కూడా కాలువలపై ఒక తట్ట మట్టి వేసిన పాపాన పోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాలువలపై డోర్లు, షట్టర్లు, రోప్స్, పరికరాలకు కనీసం గ్రీస్ కూడా వేయించిన పాపాన పోలేదన్నారు. కాలువలు పరిశీలిస్తే షెల్టు వేపుగా పెరిగి సాగునీరు, త్రాగునీరు దిగువకు చేరే పరిస్థితి ఎక్కడ లేదన్నారు, ఇలా ఇరిగేషన్ వ్యవస్థను అస్తవ్యస్తం చేసి రైతులకు తీరని అన్యాయం చేశారని అన్నారు. రాష్ట్రానికి నిధుల సమస్య అధికంగా ఉందని, ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనలో 14 లక్షల కోట్ల అప్పుల ఆంధ్ర ప్రదేశ్ గా మార్చాలని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇరిగేషన్ శాఖలో 18 వేల కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, వాడిని అధిగమించే పనిలో ఉన్నామన్నారు. ఎన్డీఏ నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వ్యవసాయాన్ని రైతులను కాపాడుకునేందుకు పనిచేస్తుందన్నారు. ఎటువంటి సవాల్నైనా ఎదుర్కొని సమస్యను అధికమిస్తామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో రైతు పక్షపాత ప్రభుత్వంకొనసాగుతుందని వివరించారు. పల్నాడు జిల్లా ప్రజలు దాహార్తిని తీర్చాలని ఎమ్మెల్యే జివీ ఆంజనేయులు తమ దృష్టికి సమస్యను తీసుకురాగా సీఎం చంద్రబాబు నాయుడు సహకారంతో కృష్ణ రివర్ బోర్డుతో చర్చించి కుడికాలువకు 5 టీఎంసీల నీటిని త్రాగునీటి అవసరాలకు విడుదల చేయడం జరిగిందన్నారు. కృష్ణ డెల్టాకు, రైట్ కెనాల్ కు బాగుంది నీటి ప్రాధాన్యతపై రివ్యూ చేసి నీటి విడుదల కొనసాగిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ పల్నాడు జిల్లా ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఎన్ఎస్పి కుడికాలువకు త్రాగునీరు విడుదలకై మంత్రి నిమ్మల రామానాయుడు చేసిన కృషి అభినందనీయమని అన్నారు. గుండ్లకమ్మ వాగుకు, ఈపూరు చెరువుకు నాగార్జునసాగర్ మెయిన్ కెనాల్ నుండి నీటి విడుదలపై “తూము” అనుమతి కల్పించాలని కోరారు. గతంలో వినకొండ మండలంకనుముల చెరువు, పెద్ద కంచర్ల చెరువులకు ఏ విధంగా ఎన్ఎస్పి నుండి తూము అనుమతి ఇచ్చారో అదేవిధంగా అనుమతులు ఇప్పించాలని కోరారు. గుండ్లకమ్మ పరివాహక ప్రాంతంలో అనేక గ్రామాల రక్షిత మంచినీటి పథకాలు,గిరిజన రేషన్షియల్ స్కూల్లకు మంచినీటి పథకాలు ఉన్నాయని, వేసవి సమయంలో కుళ్ళకమ్మ ఎండిపోయి త్రాగునీరు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అలాగే 36 కిలోమీటర్లు ఉన్న గుండ్లకమ్మ నదిపై చెక్ డామ్ ల నిర్మాణం చేపట్టాలని కోరారు. ఈ ప్రాంత ప్రజలను ఆదుకునేందుకు మెయిన్ కెనాల్ నుండి తూము అనుమతి ఇవ్వవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. స్పందించిన మంత్రి రామానాయుడు మాట్లాడుతూతప్పనిసరిగా తూము అనుమతులు కల్పిస్తామని, అంచనాల తయారుచేసి గుండ్లకమ్మ పై చెక్ డ్యాములు నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సీఎం చంద్రబాబు నేడు శ్రీశైలం రాక..
రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు 1వ తేదీ గురువారం నేడు శ్రీశైలం రానున్నట్లు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. శ్రీశైలం డ్యాం నుండి గేట్లు ఎత్తి నాగార్జునసాగర్ డ్యామ్ కు నీరు విడుదల చేయడంతో సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదగా “జలహారతి” కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, మాదినేని ఆంజనేయులు, ముత్తినేని ఏడుకొండలు ,మీసాల మురళీకృష్ణ ,కర్నాటి వెంకటేశ్వర్ రెడ్డి ,మద్దుకురాం బ్రహ్మం,టిడిపి నాయకులు,నియోజకవర్గ రైతులు,ఎన్ఎస్పి అధికారులు తదితరులు పాల్గొన్నారు. (Story : ఇరిగేషన్ వ్యవస్థను విధ్వంసం చేసిన జగన్ రెడ్డి.. )

