కంచు శ్రీను భార్య మృతి
కందుల పరామర్శ
న్యూస్ తెలుగు/ చాట్రాయి : తెలుగుదేశం పార్టీ కార్యకర్త కంచు శ్రీను భార్య రాం పుల్లమ్మ జ్వరంతో మృతి చెందడంతో మాజీ ఎంపీపీ కందుల కృష్ణ పరామర్శించారు. చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో బలహీనవర్గాల నివాస ప్రాంతంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్త కంచు శ్రీను భార్య గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతూ విజయవాడ ప్రవేట్ ఆసుపత్రిలో మృతి చెందింది. సోమవారం ఉదయం కందుల కృష్ణ వారి నివాసానికి వెళ్లి కుటుంబీకులను పరామర్శించారు. వారి పిల్లలను ఓదార్చారు అనంతరం కందుల కృష్ణ మాట్లాడుతూ. ఆనాటి నుండి ఈనాటి వరకు కంచు వారి కుటుంబం మొత్తం తెలుగుదేశం పార్టీకి అండదండగా నిలుస్తుందని పార్టీ కుటుంబంలో పుల్లమ్మ చనిపోవడం తీరని లోటు అన్నారు. పార్టీ వారి కుటుంబానికి అండదండగా నిలుస్తుంది అన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు, చీరాల మారేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. (Story : కంచు శ్రీను భార్య మృతి )