తెలుగు రాష్ట్రాల పాఠశాలల్లో రూట్స్ 2 రూట్స్ ఆర్ట్ వర్క్‌షాప్‌లు
న్యూస్‌తెలుగు/ముంబయి: కళలు, సంస్కృతి, వారసత్వాన్ని ప్రోత్సహించడానికి అంకితమైన ఢల్లీికి చెందిన లాభాపేక్షలేని సంస్థ, రూట్స్2రూట్స్ (ఆర్2ఆర్), తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలల్లో ఆర్ట్ వర్క్‌షాప్‌లను నిర్వహించనుంది. సాంప్రదాయ స్టెమ్ (ఎస్‌టీఈఎం`సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ మరియు మ్యాథమెటిక్స్) పాఠ్యాంశాల్లో కళలను చేర్చడం ద్వారా దానిని స్టీమ్((ఎస్‌టీఈఏఎం`సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఆర్ట్స్, మరియు గణితం)గా మార్చటం ద్వారా భారతదేశ నూతన విద్యా విధానం (ఎన్‌ఈపి) అమలుకు మద్దతుగా ఈ కార్యక్రమం రూపొందింది, ఈ వర్క్‌షాప్‌లలో కళాకారులు, ఆర్ట్ టీచర్‌లతో లైవ్ సెషన్‌లు ఉంటాయి. వారు ఒడిస్సీ, కథక్ కళారూపాలలో విద్యార్థులకు విద్యను అందించడానికి పాఠశాలలను సందర్శిస్తారు. ఇంటరాక్టివ్ సెషన్‌లు విద్యార్థులకు నిపుణుల నుండి నేరుగా నేర్చుకోవడానికి, ప్రత్యక్ష ప్రదర్శనలను చూడటానికి, ప్రశ్నోత్తరాల సెషన్‌లలో పాల్గొనడానికి ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తాయి. (Story : తెలుగు రాష్ట్రాల పాఠశాలల్లో రూట్స్ 2 రూట్స్ ఆర్ట్ వర్క్‌షాప్‌లు)