చార్జ్ జోన్‌తో హ్యుందాయ్ మోటార్ డీల్
న్యూస్‌తెలుగు/న్యూదిల్లీ: హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌ఎంఐఎల్) చార్జ్‌జోన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దేశంలోని 100 హ్యుందాయ్ డీలర్‌షిప్‌లలో డిసి ఫాస్ట్ చార్జర్లను ఏర్పాటు చేయనున్నాయి. ప్రస్తుతం హెచ్‌ఎంఐఎల్ దేశవ్యాప్తంగా 34 ఈవీ ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్ల నెట్‌వర్క్‌ను కలిగిఉంది. అన్ని ఓఈఎం బ్రాండ్ల ఈవీ కస్టమర్లు ‘మై హ్యుందాయ్’ లేదా ‘చార్జ్ జోన్’ యాప్ ద్వారా ఫాస్ట్ ఛార్జర్ల నెట్‌వర్క్‌ను యాక్సెస్ చేయవచ్చు. (Story : చార్జ్ జోన్‌తో హ్యుందాయ్ మోటార్ డీల్)