హ్యుందాయ్ క్రెటాకు 6 నెలల్లో లక్ష కస్టమర్లు
న్యూస్‌తెలుగు/ గురుగ్రామ్: సరికొత్త హ్యుందాయ్ క్రెటా`2024 ఒక లక్ష హ్యాపీ కస్టమర్లతో వివాదరహిత పండుగ చేసుకుంటోంది. 2024 జనవరిలో కొత్త హ్యుందాయ్ క్రెటా లాంచ్ అయిన నాటి నుంచి కేవలం 6 మాసాల్లో ఒక లక్ష యూనిట్లను విక్రయించి రికార్డు నెలకొల్పింది. పైగా ఈ కస్టమర్లలో ఏ ఒక్కరి నుంచీ ఎలాంటి ఫిర్యాదులు లేవు. ఈ వాహనం పట్ల అందరూ సంతృప్తి వ్యక్తం చేయడమే హ్యుందాయ్ సాధించిన గొప్ప విజయంగా చెప్పవచ్చు. రోజుకు 550కిపైగా క్రెటా వాహనాలను విక్రయించిందంటే ఈ వాహనానికి ఆదరణ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇది అల్టిమేట్ ఎస్‌యూవీగా నిలిచిందని హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ సీఓఓ తరుణ్ గార్గ్ తెలిపారు. భారత ఆటోమోబైల్ పరిశ్రమలో హ్యుందాయ్ క్రెటా మరిన్ని మైలురాళ్లను అధిగమిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. (Story : హ్యుందాయ్ క్రెటాకు 6 నెలల్లో లక్ష కస్టమర్లు)

