కోడి పందెం స్థావరాలపై దాడి
న్యూస్తెలుగు/వాజేడు వెంకటాపురం: కోడిపందం స్థావరాలపై పోలీసులు దాడి చేసి 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని చింతూరు గ్రామ శివారులో కోడిపందాలు నిర్వహిస్తున్నారన్న నమ్మదగిన సమాచారంతో వాజేడు ఎస్సై హరీష్ దాడులు నిర్వహించారు. పోలీసులను గమనించిన పందెం రాయుళ్లు అక్కడి నుండి పారిపోయేందుకు ప్రయత్నించగా వారిని వెంబడించిన పోలీసులు 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారి దగ్గర ఐదు కోడి పుంజులు, నాలుగు కత్తులు, రూ 28900 నగదునుపోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పట్టుబడిన వారి వివరాలను సేకరించివారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దాడుల్లో సిఆర్పిఎఫ్ కామా సివిల్ పోలీసులు పాల్గొన్నారు. (Story : కోడి పందెం స్థావరాలపై దాడి)