సాయిబాబాకు విశేషాలంకరణ
న్యూస్ తెలుగు/విజయనగరం టౌన్: విజయనగరం పట్టణంలో ధర్మపురి రోడ్డు వద్ద ఉన్న అవధూత దత్త సాయి సమర్థపీఠంలో ఉన్న షిరిడి సాయిబాబా కు గురువారం ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు ఉత్సవ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి అనంతరం ఉత్సవ, మూలవిరాట్ విగ్రహాలకు విశేషాలంకరణ సాయి సుందర మహారాజ్ ఆధ్వర్యంలో రామకృష్ణ శర్మచే నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి సుందర మహారాజ్ మాట్లాడుతూ ఉత్తరాంధ్రకు మొదటిగా స్థాపించిన అవధూత దత్త సాయి సమర్థపీఠంలో ఉన్న సాయిబాబా దేవాలయానికి ఎంతో ఘన చరిత్ర ఉందన్నారు. ప్రతి గురువారం ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు ఉత్సవ విగ్రహానికి భక్తులకే పాలాభిషేకం నిర్వహించడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా మూలవిరాట్ విగ్రహానికి శ్రీరామనవమి, దసరా, గురు పౌర్ణమి పర్వదినాలలో భక్తులచే పాలాభిషేకం నిర్వహించడం జరుగుతుందన్నారు. వీటితోపాటు ప్రతి ఆదివారం సిద్దిరాజ దత్తాత్రేయ స్వామికి భక్తుల గోత్రనామాలతో తైలాభిషేకం నిర్వహిస్తున్నమన్నారు. (Story: సాయిబాబాకు విశేషాలంకరణ)