UA-35385725-1 UA-35385725-1

సత్య కళాశాలలో ఉద్యోగ నైపుణ్యాలపై వర్క్ షాప్

సత్య కళాశాలలో ఉద్యోగ నైపుణ్యాలపై వర్క్ షాప్

విజ‌య‌న‌గ‌రం (న్యూస్ తెలుగు) : స్ధానిక తోట పాలెం లో గల సత్య డిగ్రీ మరియు పీజీ కళాశాలలో శ‌నివారం ఉద్యోగ నైపుణ్యాల పై ఐదు రోజుల పాటు జరిగిన వర్క్ షాప్ ముగింపు కార్యక్రమం జరిగింది.

ఈ వర్క్ షాప్ ను మహీంద్రా ప్రైడ్ క్లాస్ రూం, నాంది ఫౌండేషన్, ఆంధ్ర ప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడెమీ వారి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ వర్క్ షాప్ లో డిగ్రీ తృతీయ సంవత్సరం విద్యార్థినులు కు నాంది ఫౌండేషన్ ట్రైనర్స్ కె. గౌతమ్ శంకర్, P. వేణు గోపాల్ ఐదు రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. ఈ వర్క్ షాప్ లో బాడీ లాంగ్వేజ్, ప్రొఫెషనల్ గ్రూమింగ్, గోల్ సెట్టింగ్,ఇంటర్వ్యు స్కిల్స్, గ్రూప్ డిస్కషన్, ఎక్స్టెంపరో స్పీచ్ ల పై శిక్షణ ఇచ్చారు. ఈ రోజు మాక్ ఇంటర్వ్యూ నిర్వహించారు. తదుపరి విద్యార్థినులకు ఈ శిక్షణ సర్టిఫికేట్స్ ను ఇచ్చారు.

కళాశాల సంచాలకులు శశి భూషణరావు మాట్లాడుతూ విద్యార్ధినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నైపుణ్యాలను పెంచుకొనపోతే ఈ పోటీ ప్రపంచంలో మంచి అవకాశాలను అందిపుచ్చు కోలేమని, కనుక నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఈ క్లాసుల్లో నేర్చుకున్న విషయాలను ప్రాక్టీస్ చేసుకోవాలని అన్నారు. నాంది ఫౌండేషన్ వారికి, మహేంద్ర ప్రైడ్ క్లాస్ రూం వారికి, ఆంధ్ర ప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడెమీ వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ట్రైనింగ్ పూర్తి అయిన విద్యార్థినులకు ఈ నెల 21 మరియు 23 తేదీలలో 15 కంపెనీలతో జాబ్ మేళాను నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం వి సాయి దేవ మణి, కళాశాల ప్లేస్మెంట్ ఆఫీసర్ ఎం. ఉదయ్ కిరణ్, ఆంగ్ల అధ్యాపకులు కె. పుష్ప లత విద్యార్ధినులు పాల్గొన్నారు. (sTORY: సత్య కళాశాలలో ఉద్యోగ నైపుణ్యాలపై వర్క్ షాప్)

See Also

మ‌రో ముగ్గురు ఎంపీల జంప్‌!

తెలంగాణ మీడియా అకాడ‌మీ ఛైర్మ‌న్‌గా కే.శ్రీ‌నివాస్‌రెడ్డి

బీజేపీ దారెటు?

‘పుత్రులకు’ ఓటమి ఫీవర్‌!

టీడీపీ, జ‌న‌సేన ఫ‌స్ట్ లిస్ట్ వ‌చ్చేసింది!

సంకోచంలో ‘షర్మిలక్క’

స‌ర్వే సంచ‌ల‌నం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!

కంటతడి పెట్టిన ముద్దరబోయిన!

వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?

వైసిపికి ప్ర‌ముఖ నేత‌లు గుడ్‌బై!

నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్

కెనడాలో ‘తెలుగు తల్లి’

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవ‌ల్‌!

స‌రైనోడు మూవీని మించిపోయేలా!

‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2

యూనిక్ కంటెంట్ ‘బబుల్‌గమ్’

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1