UA-35385725-1 UA-35385725-1

ప్రభుత్వ బ్లడ్ బ్యాంకు, సీతం కాలేజ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

ప్రభుత్వ బ్లడ్ బ్యాంకు, సీతం కాలేజ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

విజ‌య‌న‌గ‌రం (న్యూస్ తెలుగు) : స్థానిక గాజులరేగ పరిధిలో గల సీతం ఇంజనీరింగ్ కళాశాలలో ప్రభుత్వ బ్లడ్ బ్యాంకు, సీతం కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంలో సీతం, సత్య డిగ్రీ కళాశాలకు చెందిన ఎన్.సి.సి. మరియు ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు 50 యూనిట్లను, మరో 50 యూనిట్లను ఇరు కళాశాలల విద్యార్థులు రక్త దానం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న రాష్ట్ర బాలల హక్కుల కమిషనర్ కేసలి అప్పారావు మాట్లాడుతూ రక్తదానం చేయండి ప్రాణదాతలుకండి అని పిలుపునిచ్చారు. అలాగే విజయనగరం ఒకటవ టౌన్ పోలీస్ స్టేషన్ సి.ఐ డాక్టర్ బి.వెంకటరావు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రమాద సమయాల్లో రక్తం కొరత రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.

సీతం కళాశాల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశి భూషణరావు రక్త దానం చేసిన ఎన్.సి.సి క్యాడెట్స్, విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సీతం కళాశాల ప్రిన్సిపాల్ డా.డి.వి.రామమూర్తి, వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్.టి.డి.వి.ఎ.నాయుడు, సి.హెచ్.వెంకటలక్ష్మి, ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్
ఎన్.సతీష్ కుమార్, ఎన్.సి సి అధికారులు లెఫ్ట్‌నెంట్‌ మజ్జి వరలక్ష్మి, కెప్టెన్ ఎమ్. సత్యవేణి,
లెఫ్ట్‌నెంట్ ఎస్. ప్రశాంత్, కేర్ టేకర్ ఉదయ్ కిరణ్, సి.ఎస్.ఓ కె.సత్యనారాయణ, డాక్టర్ శైలజ, కౌన్సిలర్ అప్పలనాయుడు, ల్యాబ్ సిబ్బంది మురళి, శేఖర్, లాల్ బి సిస్టర్, శారద, ప్రవీణ, ఎన్.సి.సి క్యాడెట్స్ మరియు విద్యార్దులు పాల్గొన్నారు. (Story: ప్రభుత్వ బ్లడ్ బ్యాంకు, సీతం కాలేజ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం)

See Also

మ‌రో ముగ్గురు ఎంపీల జంప్‌!

తెలంగాణ మీడియా అకాడ‌మీ ఛైర్మ‌న్‌గా కే.శ్రీ‌నివాస్‌రెడ్డి

బీజేపీ దారెటు?

‘పుత్రులకు’ ఓటమి ఫీవర్‌!

టీడీపీ, జ‌న‌సేన ఫ‌స్ట్ లిస్ట్ వ‌చ్చేసింది!

సంకోచంలో ‘షర్మిలక్క’

స‌ర్వే సంచ‌ల‌నం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!

కంటతడి పెట్టిన ముద్దరబోయిన!

వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?

వైసిపికి ప్ర‌ముఖ నేత‌లు గుడ్‌బై!

నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్

కెనడాలో ‘తెలుగు తల్లి’

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవ‌ల్‌!

స‌రైనోడు మూవీని మించిపోయేలా!

‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2

యూనిక్ కంటెంట్ ‘బబుల్‌గమ్’

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1