UA-35385725-1 UA-35385725-1

శ్రీ వైఎన్ కళాశాలలో వార్షికోత్సవ వేడుకలు

శ్రీ వైఎన్ కళాశాలలో వార్షికోత్సవ వేడుకలు

నరసాపురం (న్యూస్ తెలుగు): స్ధానిక శ్రీ వైఎన్ కళాశాలలో వార్షిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కళాశాల సెక్రెటరీ అండ్ కరస్పాండెంట్ డా. చినమిల్లి సత్యనారాయణ రావు పాల్గొని, విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ, మీ జీవితంలో కళాశాల జీవిత సమయం ఎంతో విలువైనదని, ఇక్కడ నుంచే మీ అసలు జీవిత ప్రయాణం ఆరంభమవుతుందన్నారు. ఇక్కడ మీరు నేర్చుకున్న పాఠాలు, సంస్కారం, ప్రవర్తన పైనే మీరు సమాజంలో ఏ విధమైన పాత్ర పోషిస్తారనే విషయం అవగతమవుతుందన్నారు. ఇక్కడ ఉన్నంతవరకు మీ జీవితం ఎంతో సంతోషంగా, ఉల్లాసంగా స్నేహితులే ప్రపంచంగా గడుపుతారన్నార‌ని, బయట ప్రపంచం వేరేగా ఉంటుందన్నారు. క్రమశిక్షణ, సమయపాలనతో మంచిగా చదువుకుని, ఒక మంచి ఉద్యోగం సంపాదించి, జీవితంలో స్థిరపడితే ఒక రకంగా, అల్లరి చిల్లరగా తిరిగితే మన లైఫ్ మరో రకంగా మలుపు తిరుగుతుందన్నారు. తప్పనిసరిగా మీరంతా మంచిగా చదువుకుని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే ఇక్కడ నుంచే, ఇప్పటి నుండి గమ్యాన్ని చేరడానికి ఒక మంచి మార్గాన్ని అనుసరించితే విజయం మీ సొంతమవుతుందన్నారు. అనంతరం కళాశాల విద్యార్థులకు మెరిట్ పత్రాలను, మెడల్స్ ను అందచేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల కోశాధికారి పోలిశెట్టి శ్రీరఘురామ రావు, గవర్నింగ్ బాడీ సభ్యులు చేగొండి సత్యనారాయణ మూర్తి, రెడ్డప్ప ధవేజి, అకడమిక్ అడ్వైజర్ ఆర్. వి. సుబ్బారావు, డా. కోసూరి సూర్య ప్రకాశ నారాయణ వర్మ, పి.జి.డైరెక్టర్ డా. ఎన్. చింతారావు, ప్రిన్సిపాల్ డాక్టర్ చింతపల్లి కనకారావు, .ఎడ్.కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. శాంతి, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. (Story: శ్రీ వైఎన్ కళాశాలలో వార్షికోత్సవ వేడుకలు)

See Also

తెలంగాణ మీడియా అకాడ‌మీ ఛైర్మ‌న్‌గా కే.శ్రీ‌నివాస్‌రెడ్డి

బీజేపీ దారెటు?

‘పుత్రులకు’ ఓటమి ఫీవర్‌!

టీడీపీ, జ‌న‌సేన ఫ‌స్ట్ లిస్ట్ వ‌చ్చేసింది!

సంకోచంలో ‘షర్మిలక్క’

స‌ర్వే సంచ‌ల‌నం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!

కంటతడి పెట్టిన ముద్దరబోయిన!

వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?

వైసిపికి ప్ర‌ముఖ నేత‌లు గుడ్‌బై!

నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్

కెనడాలో ‘తెలుగు తల్లి’

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవ‌ల్‌!

స‌రైనోడు మూవీని మించిపోయేలా!

‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2

యూనిక్ కంటెంట్ ‘బబుల్‌గమ్’

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1