కృష్ణా జలాలపై పరిరక్షణకు13న చలో నల్గొండ సభ
విజయవంతం చేయాలి : అరిబండి సురేష్ బాబు
నేరేడుచర్ల (న్యూస్‌తెలుగు): కేంద్రం పరిధి నుంచి శ్రీశైలం నాగార్జునసాగర్ ప్రాజెక్టులు కాపాడుకునేందుకు కెఆర్ఎంబిపై వాస్తవాలు వివరించేందుకు తెలంగాణ రాష్ట్ర హక్కులు సాధించడమే లక్ష్యంగా ఈనెల 13న కెసీఆర్ అధ్యక్షతన జరిగే చలో నల్గొండ సభను విజయవంతం చేయాలని మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అరిబండి సురేష్ బాబు అన్నారు. ఆదివారం నేరేడు చర్ల మండల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశం కార్యక్రమంలో వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం సురేష్ బాబు మాట్లాడుతూ బి ఆర్ ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని, కృష్ణ నది పై శ్రీశైలం నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నిర్వహణను రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కెఆర్ఎంబి అప్పజెప్పడంతో నల్గొండ జిల్లా ప్రజలకు, రైతులకు అన్యాయం జరుగుతుందని అన్నారు. మాజీ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి ఆధ్వర్యంలో మండలం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా రైతులు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షుడు చింతకుంట్ల సోమిరెడ్డి, మాజీ ఎంపీపీ పార్టీ సీనియర్ నాయకుడు జన్మదిన సైదులు యాదవ్, జెడ్పిటిసి అన్నపరెడ్డి నారాయణరెడ్డి, మండల పార్టీ ఉపాధ్యక్షులు వస్కుల సుదర్శన్, ఆకుల జగతయ్య గౌడ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు నందిపాటి గురువయ్య, ఎస్టి సెల్ మండల అధ్యక్షుడు మాలోతు శంకర్ నాయక్, పార్టీ నాయకులు నన్నెపంగ సైదులు, వీరారెడ్డి, లంకె పల్లి నాగార్జున, కర్ణం నరసయ్య, మిడితపెల్లి శీను, పత్తేపురం వెంకటేశ్వర్లు, నకిరేకంటి రవి, అన్ని గ్రామాల పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు, ఎంపీటీసీ లు,మాజీ సర్పంచ్ లు, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మాజీ వార్డ్ నెంబర్లు ,నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. (Story: కృష్ణా జలాలపై పరిరక్షణకు13న చలో నల్గొండ సభ)
See Also:
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!
‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2