నెల్లిమర్లలో పల్లెపల్లెకు జనసేన
విజయనగరం (న్యూస్‌తెలుగు) : విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం కొండపేట గ్రామంలో నియోజకవర్గ ఇన్చార్జ్ లోకం మాధవి ఆధ్వర్యంలో పల్లె పల్లెకు జనసేన కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజల సమక్షంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ జరిగింది. అదే విధంగా లోకం మాధవి ఇంటింటికి తిరుగుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటు గాజు గ్లాసుపై వేసి జనసేన, టిడిపి ప్రభుత్వ స్థాపనకు కృషి చేయాలని కోరారు. గ్రామంలో సమస్యలు గురించి మాట్లాడుతూ గ్రామంలో ఎక్కడ చూసినా త్రాగునీరు కొరత ఉందని, వీధి దీపాలు, కాలువలు సరైన స్థితిలో లేవని, సంక్షేమ పథకాలు ఉన్నవారికి ఇచ్చి, లేని వారికి ఇవ్వడం లేదని కనీసం ఈ వైసిపి ప్రభుత్వం అధికారులు కానీ నాయకులు గాని అసలేమీ పట్టించుకోవటం లేదని ప్రజలు వాపోయారు. లోకం మాధవి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో జనసేన టిడిపి ప్రభుత్వ రాగానే నియోజకవర్గంలో త్రాగునీరు సమస్య ఉండదని, ప్రతి ఇంటికి మంచినీటి కొళాయి వచ్చే విధంగా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని గ్రామ ప్రజలందరికీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నెల్లిమర్ల మండల సీనియర్ నాయకులు, గ్రామ ప్రజలు జనసైనికులు వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. (Story: నెల్లిమర్లలో పల్లెపల్లెకు జనసేన)
See Also:
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!
‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2