ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలి
కమిషనర్ ఎం. మల్లయ్య నాయుడు ఆదేశం
విజయనగరం (న్యూస్ తెలుగు) : ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సచివాలయ అడ్మిన్ కార్యదర్శులకు నగరపాలక సంస్థ కమిషనర్ ఎం. మల్లయ్య నాయుడు ఆదేశించారు. సచివాలయాలలో జరుగుతున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆయన శనివారం పరిశీలించారు. 16, 31వ సచివాలయాలకు చేరుకొని ఏ మేరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతోందో కార్యదర్శులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశాల మేరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా వివిధ సచివాలయాలలో జరుగుతున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియ ను స్వయంగా పరిశీలించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ సొంతింటి కల సాకారం చేసే విధంగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిందన్నారు. అదేవిధంగా మంజూరు చేసిన ఇళ్ళ పట్టాలను రిజిస్ట్రేషన్ చేయించి లబ్ధిదారులకు పూర్తి హక్కులతో లభించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. దీంతో అన్ని సచివాలయాల ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియలు చేపడుతున్నట్లు తెలిపారు. (Story: ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలి)
See Also:
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!
‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2