ఇకపై విజయవాడ నుంచి నాగ్‌పూర్‌కు డైరెక్ట్ హైవే!
Vijayawada-Nagpur High Way: ఇకపై ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్రకు మరో డైరెక్ట్ రూట్ రాబోతున్నది. విజయవాడ నుంచి నాగ్‌పూర్‌కు నేరుగా హైవే రాబోతున్నది. ఏపీ నుంచి మరో జాతీయ రహదారి మహారాష్ట్రను అనుసంధానించనుండటంతో ఈ వెసులుబాటు రానున్నది. విజయవాడ-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) కార్యాచరణకు ఉపక్రమించిన నేపథ్యంలో ఈ సౌకర్యం వస్తున్నది. రూ.14 వేల కోట్లతో మొత్తం 457 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించే ప్రణాళికను ఎన్‌హెచ్‌ఏఐ ఆమోదించింది. ఈమేరకు పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాను మరింత వేగవంతం చేసే లక్ష్యంతో మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాన్ని అనుసంధానిస్తూ ఈ గ్రీన్‌ఫీల్డ్-బ్రౌన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మిస్తారు. దీనికి సంబంధించి సాధ్యాసాధ్యాలపై నివేదికను. డీపీఆర్‌ను ఖరారు చేశారు. ఈ అనుసంధానం ఎలా వుంటుందంటే… విజయవాడ-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ హైవేను అయిదు ప్యాకేజీల కింద నిర్మిస్తారు. వాటిలో విజయవాడ-ఖమ్మం, ఖమ్మం-వరంగల్, వరంగల్-మంచిర్యాల ప్యాకేజీలను గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేలుగా.. మంచిర్యాల-రేపల్లెవాడ, రేపల్లెవాడ-చంద్రాపూర్ ప్యాకేజీలను బ్రౌన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేలుగా నిర్మిస్తారు. చంద్రాపూర్ నుంచి నాగ్‌పూర్‌కు ఇప్పటికే ఉన్న 4 లేన్ల ఎక్స్‌ప్రెస్ హైవేకి ఈ రహదారిని అనుసంధానిస్తారు. మొత్తం మీద 310 కిలోమీటర్ల గ్రీన్‌ఫీల్డ్, 147 కిలోమీటర్ల బ్రౌన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే రూపుదిద్దుకోనుంది. దీనివల్ల విజయవాడ నుంచి నాగ్‌పూర్‌కు చేరుకోవడం రోడ్డు మార్గంలో చాలా తేలిక అవుతుంది. ఉత్తర తెలంగాణ ప్రాంతాలకు చేరుకోవడం కూడా చాలా సులభతరం అవుతుంది. నాగ్‌పూర్‌కు త్వరతిగతిన చేరుకోవడం వల్ల అక్కడి నుంచి ముంబయికి వెళ్లడం ఎంతో సులువవుతుంది. రాబోయే రాకపోకలకు, రవాణా వ్యవస్థకు విజయవాడ`నాగ్‌పూర్ హైవే ఎంతో ఉపయుక్తంగా వుంటుంది. విజయవాడ-నాగ్‌పూర్ మధ్య దూరం 163 కిలోమీటర్లు తగ్గి ఐదుగంటల సమయం కలసివస్తుంది. ప్రస్తుతం విజయవాడ నుంచి నాగ్‌పూర్ వెళ్లాలంటే హైదరాబాద్, అదిలాబాద్ మీదుగా 770 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. దాదాపు 13 గంటల సమయం పడుతోంది. ఈ కొత్త ఎక్స్‌ప్రెస్ హైవేను విజయవాడ నుంచి ఖమ్మం, వరంగల్, మంచిర్యాల మీదుగా వుంటుంది. కాగా, దీనికి సంబంధించి విజయవాడ రూరల్, జి.కొండూరు, గంపలగూడెం మండలాల్లో దాదాపు 1.65 లక్షల చదరపు మీటర్ల భూసేకరణ జరుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. (Story: ఇకపై విజయవాడ నుంచి నాగ్‌పూర్‌కు డైరెక్ట్ హైవే!)
See Also:
అంగన్‌వాడీ వర్కర్లకు శుభవార్త!
తెలంగాణలో భారీ వానలు : దెబ్బతిన్న రైతన్న
అనసూయ బర్త్ డే సందర్భంగా ‘వాంటెడ్ పండుగాడ్’ ఫస్ట్ లుక్
హార్ట్ ఉన్న ప్రతి ఒక్కరికీ టచ్ అవుతుంది!
‘హిడింబ’ ఫస్ట్ గ్లింప్స్ విడుదల
ఏకంగా 23 మంది వాలంటీర్లపై వేటు! ఎందుకని?
ఫుల్‌బాటిల్ విస్కీ కన్నా అమిత్ షా తాగే నీళ్ల ధరే కాస్ట్‌లీ!
ఒకే ఆసుపత్రిలో 11 మంది స్టాఫ్‌కు ఒకేసారి కడుపొచ్చింది!
నాగచైతన్య ‘థాంక్యూ’ రిలీజ్ డేట్ ఫిక్స్!
`గ్రే` మూవీ ట్రైలర్ విడుదల
సర్కారువారి పాట చూసిన నమ్రత!
భర్తను ముక్కలుగా నరికి.. కూర వండేసింది!
స్విమ్మింగ్ పూల్‌లోనే అత్యాచారం
ఆర్‌ఆర్‌ఆర్ ఓటీటీ ట్రైలర్ అదుర్స్!
‘సర్కారు వారి పాట’కు బ్లాక్ బస్టర్ టాక్!
సర్కారువారి పాట అసలు రివ్యూ…వీడియోతో సహా!
పిజ్జా రెండు ముక్కలు తిన్నాడు…గుండె ఆగింది!
అధికారులపై పెట్రోల్ దాడి-వైరల్ వీడియో
కేసీఆర్‌పై మోదీ కక్షసాధింపు షురూ!
ఫస్ట్‌నైట్ భయంతో వరుడు ఆత్మహత్య!
9 Hours is the next offering on Hotstar Specials
Sarkaru Vaari Paata Received Unanimous Blockbuster Talk