కేసీఆర్‌తో కలిసి పనిచేయడం చాలా కష్టం : గవర్నర్ తమిళిసై ఘాటు వ్యాఖ్యలు
చెన్నై: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, గవర్నర్ తమిళసై సౌందరరాజన్‌ల మధ్య గత కొన్ని రోజులుగా దూరం పెరుగుతూ వచ్చింది. ఇరువురి మధ్య పొరపొచ్చాలు పెరుగుతూ వచ్చాయి. కలిసి పనిచేయడమన్న కాన్సెప్ట్‌ను ఇద్దరూ వదిలేశారు. తాజాగా తమిళిసై సౌందరరాజన్ మరోసారి చేసిన కీలక వ్యాఖ్యలు అగ్గిమీద గుగ్గిలం వేసినట్లుగా భావించవచ్చు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కలిసి పనిచేయడం చాలా కష్టమని ఆమె వ్యాఖ్యానించారు. ఇంతకీ ఆమె మాట్లాడిరది హైదరాబాద్‌లో కాదు…తమిళనాడులో. ఇక్కడి వ్యవహారాలు అక్కడ మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందంటే…ఇద్దరి మధ్య ‘గ్యాప్’ ఏ స్థాయిలో వుందో తెలుస్తోంది. చెన్నైలో మంగళవారంనాడు తన కాఫీటేబుల్ పుస్తకావిష్కరణ సందర్భంగా తమిళిసై ఈ వ్యాఖ్యలు చేశారు. సీఎం, గవర్నర్ కలిసి పనిచేయకపోతే ఎలా ఉంటుందో తెలంగాణను చూస్తే అర్థమవుతుందని ఘాటుగా అన్నారు. తాను ఇద్దరు వేర్వేరు సీఎంలతో పని చేస్తున్నానని.. ఇద్దరూ చాలా భిన్నమైనవారని చెప్పారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన కొందరు ముఖ్యమంత్రులు నియంతృత్వంతో వ్యవహరిస్తున్నారని పరోక్షంగా కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆమె అన్నారు. తాను మహిళా గవర్నర్‌ని అని తెలంగాణ ప్రభుత్వం తనపై వివక్ష చూపుతోందని, ప్రోటోకాల్ పాటించట్లేదని రెండు వారాల క్రితం ఆమె చేసిన వ్యాఖ్య సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. తాను రబ్బర్ స్టాంప్ గవర్నర్ ను కానని తేల్చి చెప్పారు. సీఎం చెప్పారని ప్రతి ఫైల్‌పై సంతకం చేయనని స్పష్టం చేశారు. తనను వేరే రాష్ట్రానికి బదిలీ చేస్తారనేది అవాస్తం అన్నారు. ఢల్లీి వెళ్లిన వెంటనే తనపై అసత్య ప్రచారం చేశారని పేర్కొన్నారు. కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించిన తర్వాత ఇక్కడ ఇద్దరి మధ్య అంతరం పెరిగిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. (Story: కేసీఆర్‌తో కలిసి పనిచేయడం చాలా కష్టం : గవర్నర్ తమిళిసై ఘాటు వ్యాఖ్యలు)
See Also:
జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులు వీరే!
యమడేంజర్: ఎంతపని చేసింది…గొంతు కోసింది!
లేజర్ కిరణాలతో విమానాల విధ్వంసం!
రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు
వర్క్ ఫ్రమ్ హోమ్ : పేలిన ల్యాప్‌టాప్
ఇంట్లో ఎవ్వరూ లేకపోవడం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?
కన్నతల్లిని పదేళ్లు బంధించిన కసాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!
భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్ చేయించాడు!
ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!
కొంపముంచిన ప్రీ వెడ్డింగ్ షూట్.. చావుబతుకుల మధ్య కొత్త జంట
కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు
హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!
నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్
రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?
ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?
అమ్మఒడికి ఆంక్షలు…పూర్తి వివరాలివే! అప్లయ్ చేసుకునే విధానం!
కేసీఆర్ నిర్ణయంతో ఆంధ్రోళ్లకు కోట్లుకోట్లు
కేజీఎఫ్: ఛాప్టర్ 2 అసలు సిసలు సమీక్ష ఇదే!
కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!
ఎన్‌టీఆర్, చరణ్‌లలో డామినేషన్ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి
తూచ్! రాజీనామా లేఖకాదు…థ్యాంక్స్ లేఖ!
విజయ్ ‘బీస్ట్’ మూవీ పెర్‌ఫెక్ట్ రివ్యూ!
ఇకపై హైదరాబాద్ శివారు భూములు బంగారమే!
పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్
పింఛను డబ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!
చనిపోయాడని పూడిస్తే…బతికొచ్చాడు!
స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : కటకటాల్లో టీచర్