Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ అమ్మఒడికి ఆంక్షలు…పూర్తి వివరాలివే! అప్లయ్‌ చేసుకునే విధానం!

అమ్మఒడికి ఆంక్షలు…పూర్తి వివరాలివే! అప్లయ్‌ చేసుకునే విధానం!

0
How to apply Ammavadi

అమ్మఒడికి ఆంక్షలు…పూర్తి వివరాలివే!

Jagananna Ammavadi: అమ్మఒడి లబ్ధిదారులకు ఊహించని షాక్‌ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడికి ఆంక్షలు విధించింది.విద్యుత్‌ వాడకం 300 యూనిట్ల లోపు వుంటేనే అమ్మఒడిని మంజూరు చేయనున్నట్లు తేల్చిచెప్పింది. విద్యుత్‌ వాడకం 300 యూనిట్లు దాటితే అమ్మఒడి కట్‌ అని క్లియర్‌కట్‌గా చెప్పింది. విద్యుత్‌ వాడకం 300 యూనిట్ల లోపు వుంటేనే అమ్మఒడి పథకం ప్రయోజనం లభిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. అమ్మఒడి పథకానికి సంబంధించిన అర్హతలను జగన్‌ ప్రభుత్వం తాజాగా పాఠశాల విద్యాశాఖ జారీ చేసింది. నవంబరు 8వ తేదీ నుంచి ఏప్రిల్‌ 30వ తేద వరకు విద్యార్థి హాజరు 75 శాతం వుండాలని, అలా లేకపోయినా అమ్మఒడి పథకం వర్తించబోదని స్పష్టంచేసింది. బియ్యం కార్డు కొత్తది వుండాలని, కొత్త జిల్లాలు ఏర్పడిన నేపథ్యంలో ఆధార్‌లో జిల్లా పేరును మార్చుకోవాలని తెలిపింది. బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ లింకు చేసుకోవడం, బ్యాంకు ఖాతాలు పనిచేస్తున్నాయో లేదో విద్యార్థుల తల్లిదండ్రులు తనిఖీ చేసుకోవాలని సూచించింది. ఆధార్‌ కార్డులో కొత్త జిల్లాల పేర్లు అనివార్యంగా ఆ ఉత్తర్వుల్లో తెలిపింది. స్కూలులో 75 శాతం హాజరు తప్పనిసరి అని పునరుద్ఘాటించింది. అన్నింటికన్నా ముందుగా వలంటీర్ల వద్ద విద్యార్థుల పేర్లు, వయసు సరిచూసుకోవాలని పేర్కొంది. అమ్మఒడికి కోత విధించడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిరచాయి. జగన్‌ ప్రభుత్వం నవరత్నాలు పేరుతో పథకాలు ఇస్తున్నామని చెప్పడం, రెండేళ్లు పూర్తయిన తర్వాత కోతలతో వాతలు పెట్టడం, ఇదెంతవరకు సమంజసమని టీడీపీ నాయకులు విమర్శించారు. పథకాల నిర్వహణ కష్టసాధ్యమని అనుకున్నప్పుడు, వాటిని ఎందుకు పెట్టాలని, ఇప్పుడు కోతలతో ప్రజలను ఎందుకు మోసం చేయాలని విమర్శించారు.

అప్లయ్‌ చేసుకునే విధానం!

1. https://resident.uidai.gov.in/bank-mapper ఈ లింక్ లో అమ్మ ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. OTP వస్తుంది, OTP ఎంటర్ చేయండి. లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ చూపిస్తుంది.

2. అలా చూపించే అకౌంట్ నంబర్, పేరెంట్ ను నోట్ చేసుకోమని చెప్పండి. స్కూల్ లో HM login లో ఉన్న అకౌంట్ ఈ అకౌంట్ ఒకటేనా కాదో చెక్ చేయించుకోమని చెప్పండి.

3. ఏ బ్యాంక్ అకౌంట్ చూపించకుంటే, స్కూల్ లో ఇచ్చిన బ్యాంక్ అకౌంట్, HM login లో తెలుసుకొని, ఆ బ్యాంక్ కి వెళ్లి NPCI Aadhar based payement service activate చేయించుకోమని చెప్పండి.

4. పై పనులన్నీ ఓకే అనుకున్న తర్వాత GSWS వాలంటీర్ యాప్ లో సేవల అభ్యర్థనలో పిల్లలతో aadhar e-KYC చేయించండి.

How to apply Ammavadi
How to apply Ammavadi

జగనన్న అమ్మ ఒడి కి సంబంధించి గుర్తుంచుకోవలసిన ఇటువంటి విషయాలు

1. జగనన్న అమ్మ ఒడి అటెండెన్స్ ఆధారంగా పడుతుంది
2. జగనన్న అమ్మ ఒడి బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు తో ప్రతి ఒక్కరికి లింక్ అయి ఉండాలి అదేవిధంగా ఆధార్ కార్డు కి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి
3. విద్యార్థి యొక్క తల్లి కి రెండు అంతకన్నా ఎక్కువ బ్యాంక్ అకౌంట్ లు ఉంటే అందులో ఏదో ఒక దానికి NPCI బ్యాంక్ లో చేసుకోవాలి
చేసుకుంటేనే జగనన్న అమ్మ ఒడి లబ్ధిదారుల ఖాతాలో జమ కావడం జరుగుతుంది.
NPCI చేయాలంటే మొదటగా ఆధార్ కార్డు కి ఫోన్ నెంబర్ లింక్ ఇచ్చుకోవాలి ఇది చేసిన తర్వాత బ్యాంకు వెళ్లాలి.
అమ్మఒడికి ఆధార్ ను గ్రామ, వార్డు సచివాలయాల్లో బ్యాంకు ఖాతాలకు లింకు (e-KYC) చేసుకోవాలి
చైల్డ్ ఇన్ఫో వెబ్ సైట్లో అమ్మఒడికి సంబంధించి విద్యార్థుల తల్లి ఆధార్ నంబరుకు లింకు చేసిన బ్యాంకు ఖాతా నంబరును మాత్రమే నమోదు చేయాలి
Child info లో విద్యార్థుల వివరాలను సరిదిద్దుకోవాలి. (Story: అమ్మఒడికి ఆంక్షలు…పూర్తి వివరాలివే! అప్లయ్‌ చేసుకునే విధానం!)

See Also: 

కేసీఆర్‌ నిర్ణయంతో ఆంధ్రోళ్లకు కోట్లుకోట్లు

కేజీఎఫ్‌: ఛాప్టర్‌ 2 అసలు సిసలు సమీక్ష ఇదే!

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఏపీ జనానికి షాక్‌…భారీగా ఆర్టీసీ వాత!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

తూచ్‌! రాజీనామా లేఖకాదు…థ్యాంక్స్‌ లేఖ!

విజయ్‌ ‘బీస్ట్‌’ మూవీ పెర్‌ఫెక్ట్‌ రివ్యూ!

దేవుడా! ఇదేం ఖ‌ర్మ‌! తిరుపతిలో నరకయాతన

మందు తాగుతా… కథలు రాస్తా!

ఇకపై హైదరాబాద్‌ శివారు భూములు బంగారమే!

పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్‌

ఆ దిష్టిబొమ్మ సీఎం జగన్‌దేనా?

పింఛ‌ను డ‌బ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!

చ‌నిపోయాడ‌ని పూడిస్తే…బ‌తికొచ్చాడు!

రామ్‌గోపాల్‌వ‌ర్మ‌కు ధియేట‌ర్ల షాక్‌!

స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : క‌ట‌క‌టాల్లో టీచ‌ర్‌

ఏపీలో పంచాయతీ నిధులన్నీ మాయం!

ఎంత దారుణం : శవంతో సెక్స్‌!

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version