Home టాప్‌స్టోరీ మందు తాగుతా… కథలు రాస్తా!

మందు తాగుతా… కథలు రాస్తా!

0
Prashanth Neel
Prashanth Neel

మందు తాగుతా… కథలు రాస్తా!

Daring and Dashing Director Prashanth Neel: కేజీఎఫ్‌తో భారతదేశంలోనే అగ్రదర్శకుల జాబితాలో చోటు సంపాదించిన ప్రశాంత్‌నీల్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కేజీఎఫ్‌ లాంటి గొప్ప కథను ఎలా రాశారని మీడియా అడిగినప్పుడు, మందు తాగుతూ కథలు రాస్తానని నిర్మొహమాటంగా చెప్పి మీడియా మిత్రులకు షాకిచ్చాడు. మీడియా వాళ్లు ప్రశ్నలు అడుగుతూ వుంటే దాటవేయడం, నీళ్లు నమలడం లాంటి చర్యలు తనకు అసలు అలవాటు లేదని గతంలోనే ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. ఇప్పుడు తాజాగా ఈ ప్రకటన చేసి మరోసారి సంచలన దర్శకుడిగా నిలబడ్డాడు. ప్రముఖ తెలుగు దర్శకుడు పూరి జగన్నాథ్‌ కూడా నిర్మొహమాటంగా వ్యాఖ్యలు చేస్తూ వుంటాడు. ప్రశాంత్‌ నీల్‌, పూరీ లాంటి గట్స్‌ ఉన్న దర్శకులు చాలా అరుదు. చాలావరకు సెలబ్రిటీలు వారి వ్యక్తిగత విషయాలను మీడియా ముందు ప్రస్తావించడానికి జంకుతారు. అతికొద్ది మంది మాత్రమే తమకు సంబంధించిన ప్రతి విషయాన్ని తెరిచిన పుస్తకంలా బయటపెడుతుంటారు. నందమూరి బాలకృష్ణ తాను ఏ మందు బ్రాండు వాడుతానో నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, చాలాసార్లు చెప్పారు. అందుకే బాలయ్య అంటే అతని అభిమానులకు ఒక విధమైన పిచ్చి, వెర్రి. పూరీ, బాలయ్య లాగానే దమ్మున్న సెలబ్రిటీ ప్రశాంత్‌ నీల్‌ ఇంకేమన్నాడంటే…‘‘నేను మద్యం సేవిస్తాను. మందు తాగుతూనే కథలు రాస్తుంటాను. నేను మత్తులో ఉన్నప్పుడు కూడా సినిమాలో ఈ సన్నివేశాం అవసరమా? లేదా? అనేది నిర్ధారిస్తుంటాను. ఇక్కడ కథ గురించి కాదు, దాన్ని ఎలా ప్రజెంట్‌ చేస్తున్నామనేది అత్యంత ముఖ్యమైన టాస్క్‌’ అని నిష్కర్షగా చెప్పాడు. అంతేకాదు…ఇంకేమన్నాడంటే…‘ఓ షరతుతో ఈ సీక్రెట్‌ విషయాన్ని బయటకు చెప్తున్నాను. నా ఇంటర్వ్యూలో ఈ భాగాన్ని కట్‌ చేసి పక్కన పడేయబోమని నాకు మాటివ్వండి. ఈ విషయాన్ని కచ్చితంగా మీడియాలో వచ్చేలా చూడండి’ అని చెప్పి మరీ ఈ సీక్రెట్‌ను రివీల్‌ చేశాడు ప్రశాంత్‌ నీల్‌. కాగా ప్రశాంత్‌ నీల్‌ కేజీఎఫ్‌ 2 సినిమా ఈనెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. కేజీఎఫ్‌ కన్నా కేజీఎఫ్‌ 2పై ఎక్కువగా ఎక్స్‌పెక్టేషన్స్‌ వున్నాయి. అలాగే, ప్రశాంత్‌ ప్రస్తుతం ప్రభాస్‌తో సలార్‌ మూవీ చేస్తుండగా, అనంతరం జూనియర్‌ ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయడానికి ఏర్పాట్లు పూర్తిచేశాడు. (Story: మందు తాగుతా… కథలు రాస్తా!)

See Also:

ఇకపై హైదరాబాద్‌ శివారు భూములు బంగారమే!

పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్‌

మంత్రివర్గం కీలక నిర్ణయాలు ఇవే!

ఆ దిష్టిబొమ్మ సీఎం జగన్‌దేనా?

బాలినేనికి మంత్రిపదవి దక్కకపోవడానికి కారణాలివేనా?

మంత్రుల పేషీల్లోని అధికారులకు షాక్..!

పింఛ‌ను డ‌బ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!

చ‌నిపోయాడ‌ని పూడిస్తే…బ‌తికొచ్చాడు!

రామ్‌గోపాల్‌వ‌ర్మ‌కు ధియేట‌ర్ల షాక్‌!

స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : క‌ట‌క‌టాల్లో టీచ‌ర్‌

ఏపీలో పంచాయతీ నిధులన్నీ మాయం!

ఉగాది పచ్చడి ఆరోగ్యకరమేనా?

ఎంత దారుణం : శవంతో సెక్స్‌!

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

వావ్‌! లేపాక్షికి యునెస్కో గుర్తింపు!

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

మందుబాబులకు హ్యాపీ న్యూస్‌..!

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version