Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ తూచ్‌! రాజీనామా లేఖకాదు…థ్యాంక్స్‌ లేఖ!

తూచ్‌! రాజీనామా లేఖకాదు…థ్యాంక్స్‌ లేఖ!

0
Mekathoti Sucharitha
Mekathoti Sucharitha

తూచ్‌! రాజీనామా లేఖకాదు…థ్యాంక్స్‌ లేఖ!

సీఎం జగన్‌తో సుచరిత భేటీ : మెట్టుదిగిన మేకతోటి

అమరావతి: మాజీ హోం మంత్రి సుచరితకు సంబంధించి వైసీపీ నాయకుల బుజ్జగింపుల ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది. ఏకంగా సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి ఆమెను పిలిపించారు. ఈ భేటీలో సీఎం స్వయంగా ఆమెను ఓదార్చారు. ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని, అందరికీ మంచి పదవులిస్తానని, అవసరమైతే మీకిచ్చే పదవికి క్యాబినెట్‌ హోదా కల్పిద్దామని సుచరితకు హామీయిచ్చినట్లు సమాచారం. సీఎంతో భేటీ అనంతరం మేకతోటి సుచరిత మీడియాతో మాట్లాడుతూ, తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు వచ్చిన వార్తలను ఖండిరచారు. అసలు నేను రాసింది రాజీనామా లేఖ కాదని, ఇన్నాళ్లు మంత్రిపదవి ఇచ్చి గౌరవించినందుకు సీఎంకు థ్యాంక్స్‌ చెపుతూ లేఖ రాశానని చెప్పుకొచ్చారు. మీడియా అవాక్కయింది. 2006లో రాజశేఖర్‌రెడ్డి ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చానని, జడ్పీటీసీ నుంచి హోం మంత్రి స్థాయి వరకు ఎదిగానంటే అది సీఎం జగన్‌ కల్పించిన అవకాశమేనని తెలిపారు. అనారోగ్యం కారణంగా నెల రోజులుగా బయటకు రాలేకపోయానని గుర్తుచేశారు. రెండున్నరేళ్ల తర్వాత కొంతమందిని మారుస్తానని సీఎం ముందుగానే చెప్పారని, ఈ విషయాన్ని గత కేబినెట్‌ సమావేశంలోనే ప్రకటించారని తెలిపారు. కొత్త మందికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తానని కూడా సీఎం చెప్పారన్నారు. అనారోగ్య, వ్యక్తిగత కారణాలతో కేబినెట్‌లో కొనసాగలేనేమోనని థ్యాంక్స్‌ చెబుతూ లేఖ రాస్తే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని రకరకాలుగా వార్తలొచ్చాయని ఆమె ఆవేదన వెలిబుచ్చారు. పదవి ఆశించి రాకపోవడంతో చిన్న ఎమోషన్‌కు గురయిన మాట వాస్తవమేనని, దయచేసి ఇంతటితో ఆపేయాలని మీడియాను కోరారు. సీఎం జగన్‌ కుటుంబ సభ్యురాలిగా ఎప్పుడైనా ఆయన్ను కలిసే అవకాశం తనకు ఉంటుందని, రాజకీయాల్లో ఉన్నంతకాలం తాను వైకాపాలోనే కొనసాగుతానని, జగన్‌కు విధేయురాలిగా వుంటానని చెప్పారు. వేరే వైపు చూడాల్సిన అవసరం, అగత్యం తనకు లేదన్నారు. రాజకీయాల నుంచి తప్పుకోవాల్సి వస్తే వైకాపా ఓటరుగానే ఉంటానని, ఎప్పటికీ సీఎం జగన్‌ విధేయురాలిగానే ఉంటానని సుచరిత ప్రకటించారు.

సీఎం అసహనం

సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. అయితే అందులో పాతవారిని 11 మందిని కొనసాగించగా, కొత్తగా 14 మందిని తీసుకున్నారు. సుచరితను మాత్రం పక్కనబెట్టారు. ఆమె ఎస్సీ మంత్రి. ఎస్సీ మంత్రులందరినీ కొనసాగించి, తనను మాత్రమే విస్మరించడాన్ని ఆమె జీర్ణించుకోలేక, రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెల్సిందే. బుధవారం ఆమె సీఎంతో భేటీ అవుతారా లేదా అన్న సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడిరది. బుజ్జగింపుల ప్రక్రియలో భాగంగా మంగళశారం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కొలుసు పార్థసారథి, సామినేని ఉదయభానులను బుజ్జగించిన సీఎం జగన్‌ బుధవారం మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత, పలువురు ఎమ్మెల్యేలను బుజ్జగించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సుచరిత సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె తన ఆవేదనను సీఎం వద్ద ప్రస్తావించినట్టు తెలిసింది. రెండున్నరేళ్ల తర్వాత మంత్రి వర్గం మొత్తాన్ని మార్చేస్తానని చెప్పి… 11 మందిని తిరిగి కొనసాగించి తనను పక్కన పెట్టడంతో మనస్తాపానికి గురయ్యానని సీఎంతో చెప్పినట్టు తెలిసింది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులను కొనసాగించి తనను మాత్రమే తొలగించడం బాధ కలిగించిందని కూడా ఆమె సీఎంతో అన్నట్లు సమాచారం. అయితే, మంత్రి పదవి ఇవ్వలేకపోవడానికి గల కారణాలను సీఎం వివరించినట్టు తెలిసింది. జిల్లా అభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేసి క్యాబినెట్‌ ర్యాంకుతో సమానంగా ఉండే హోదా కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చినట్టు సుచరిత సన్నిహితవర్గాలు తెలిపాయి. గౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా చర్యలు తీసుకుంటానని సీఎం చెప్పినట్టు కూడా ఆ వర్గాలు వెల్లడిరచాయి. సుచరిత రాజీనామాపై సీఎం అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. సీనియర్‌ నేతలు మాట్లాడుతున్నప్పటికీ రాజీనామా చేసి కొంత ఇబ్బందికర పరిస్థితులు కల్పించారంటూ సీఎం అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. దీంతో తన రాజీనామాను ఉపసంహరించుకునేందుకు సుచరిత సిద్ధమైనట్టు తెలుస్తోంది. కాగా, మంత్రి పదవి దక్కకపోవడంతో అసంతృప్తిగా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని కూడా సీఎం క్యాంపు కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. (Story: తూచ్‌! రాజీనామా లేఖకాదు…థ్యాంక్స్‌ లేఖ!)

See Also:

విజయ్‌ ‘బీస్ట్‌’ మూవీ పెర్‌ఫెక్ట్‌ రివ్యూ!

దేవుడా! ఇదేం ఖ‌ర్మ‌! తిరుపతిలో నరకయాతన

మందు తాగుతా… కథలు రాస్తా!

ఇకపై హైదరాబాద్‌ శివారు భూములు బంగారమే!

పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్‌

మంత్రివర్గం కీలక నిర్ణయాలు ఇవే!

ఆ దిష్టిబొమ్మ సీఎం జగన్‌దేనా?

బాలినేనికి మంత్రిపదవి దక్కకపోవడానికి కారణాలివేనా?

మంత్రుల పేషీల్లోని అధికారులకు షాక్..!

పింఛ‌ను డ‌బ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!

చ‌నిపోయాడ‌ని పూడిస్తే…బ‌తికొచ్చాడు!

రామ్‌గోపాల్‌వ‌ర్మ‌కు ధియేట‌ర్ల షాక్‌!

స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : క‌ట‌క‌టాల్లో టీచ‌ర్‌

ఏపీలో పంచాయతీ నిధులన్నీ మాయం!

ఉగాది పచ్చడి ఆరోగ్యకరమేనా?

ఎంత దారుణం : శవంతో సెక్స్‌!

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

వావ్‌! లేపాక్షికి యునెస్కో గుర్తింపు!

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

మందుబాబులకు హ్యాపీ న్యూస్‌..!

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version