Home అవీఇవీ! చ‌నిపోయాడ‌ని పూడిస్తే…బ‌తికొచ్చాడు!

చ‌నిపోయాడ‌ని పూడిస్తే…బ‌తికొచ్చాడు!

0

చ‌నిపోయాడ‌ని పూడిస్తే…బ‌తికొచ్చాడు!

24 గంటల్లో ఇంటికి తిరిగొచ్చిన మూర్తి
డెత్ మిస్ట‌రీని ఛేదించిన పోలీసులు

ఓ మ‌నిషి చ‌నిపోయాడు…ఇళ్లంతా విషాదం అలుముకుంది. ఇంటిపెద్ద కోల్పోయాడ‌న్న బాధ మిగిలింది. వారి సంప్ర‌దాయాల ప్ర‌కారం చ‌నిపోయిన వ్య‌క్తికి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. వారి ఆచారం ప్ర‌కారం ఆ మ‌నిషిని పూడ్చిపెట్టారు. 24 గంట‌లు ముగిశాయి…అంత‌లోనే ఆ వ్య‌క్తి వ‌డివ‌డిగా ఇంటికి న‌డుచుకుంటూ వ‌చ్చాడు. స్నానం చేసి వ‌స్తాను…త్వ‌ర‌గా అన్నం పెట్ట‌మ్మా అంటూ కూతుర్ని ఆదేశించాడు. కుటుంబ‌మంతా అవాక్క‌యింది. అత‌ను ఊర్లోకి ఎంట‌రైన‌ప్పుడే జ‌నమంతా విచిత్రంగా చూడ‌టం మొద‌లుపెట్టారు. కొంత‌మంది అత‌న్ని చూసి భ‌య‌ప‌డ్డారు కూడా. అత‌నికి ఏమీ అర్థం కాక అలా వ‌చ్చేశాడు. ఇంటికొచ్చాక‌…ఇంట్లో వాళ్లు కూడా అలాగే ప్ర‌వ‌ర్తించ‌డం మొద‌లుపెట్టారు. తీరా…చూసేస‌రికి ఇదంతా త‌న సంతాప కార్య‌క్ర‌మ‌మేన‌ని అత‌ను గ్ర‌హించి, నేను చ‌చ్చిపోలేదురో బాబోయ్ అంటూ అరిచాడు. ఇంత‌కీ మీరు ఎవ‌రి శ‌వాన్ని త‌గ‌ల‌బెట్టాశారో చూడండంటూ పోలీసుల‌కు స‌మాచార‌మిచ్చారు. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. అస‌లు పోలీసులు ద‌ర్యాప్తు
చేయాల్సిన అవ‌స‌ర‌మేముంది? వివ‌రాల్లోకి వెళితే…

తమిళనాడులోని ఈరోడ్‌కు సమీపంలోని బనగలద్‌పూర్ అనే ఊరుంది. సత్యమంగళం పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే ఆ ఊర్లో మూర్తి అనే పెద్దమనిషి కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. వయసు 60 అయినా ఏరోజూ ఖాళీగా ఉండరాయన. ఎండాకాలం ఊళ్లో పెద్దగా పనులు లేకపోవడంతో చెరుకు తోటలో పని కోసం త్రిసూర్‌ వెళ్లాడు. ఆదివారం త్రిసూర్‌ నుంచి మూర్తి కుటుంబీకులకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. అది మూర్తి మరణవార్త. త్రిసూర్‌ బస్టాండులో విగతజీవిగా పడిఉన్న వ్యక్తిని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఫోన్ కాల్ తర్వాత త్రిసూర్ వచ్చిన మూర్తి కొడుకు కార్తీ.. చనిపోయింది తన తండ్రేనని నిర్ధారించుకున్నాడు. అప్పటికప్పుడు డబ్బులు సర్దుకొని మృతదేహాన్ని సొంతూరు బనగలద్‌పూర్ తీసుకొచ్చి అత్యక్రియలు నిర్వహించారు. ఆచారం ప్ర‌కారం, ఆ శ‌వాన్ని పూడ్చిపెట్టారు. సిమెంటు దిమ్మ కూడా క‌ట్టారు. 24 గంట‌లు గ‌డిచాయి. ఆదివారం సాయంత్రం మూర్తి అంత్యక్రియలు జరగ్గా.. సోమవారం సాయంత్రానికి ఆయన సజీవంగా ఇంటికి తిరిగొచ్చాడు. మూర్తిని చూసి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు షాకయ్యారు. తండ్రి చనిపోయాడని వార్త తెలిసినప్పటికంటే మళ్లీ ఇంటికి తిరిగిరావడమే పెద్ద షాక్ లా అనిపించిందని కుటుంబీకులు చెప్పారు.
అసలేం జరిగింది? చనిపోయాడనుకొని కుటుంబీకులు పాతిపెట్టిన మృతదేహం ఎవరిది? మూర్తి ఆనవాళ్లు, వాళ్ల కొడుకుల ఫోన్ నంబర్లు చనిపోయిన వ్యక్తి దగ్గర ఉండటమేంటి? అనే సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చ‌నిపోయిన వ్య‌క్తి ఎవ‌రో నిర్ధారించుకోవాల‌ని, ఆ త‌ర్వాత ఆయ‌న వ‌ద్ద మూర్తికి సంబంధించిన ఫోన్ నెంబ‌రు ఎలా వుంద‌న్న అంశాన్ని తెలుసుకోవాలి. ఈ దిశ‌గా పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు. (story: చ‌నిపోయాడ‌ని పూడిస్తే…బ‌తికొచ్చాడు!)

మూర్తి గారి మరణ మిస్టరీ:  చనిపోయాడని పూడ్చిపెడితే.. 24 గంటల్లో ఇంటికి తిరిగొచ్చాడు!

See Also: రామ్‌గోపాల్‌వ‌ర్మ‌కు ధియేట‌ర్ల షాక్‌!

స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : క‌ట‌క‌టాల్లో టీచ‌ర్‌

మంత్రుల్లో ఆ న‌లుగురూ సేఫ్‌!

ఏపీలో పంచాయతీ నిధులన్నీ మాయం!

ఉగాది పచ్చడి ఆరోగ్యకరమేనా?

మేకపాటి గౌతమ్‌రెడ్డి స్థానంలో మంత్రి ఎవరో తెలుసా?

మాకొద్దీ మంత్రిగిరీ! Special Story)

ఎంత దారుణం : శవంతో సెక్స్‌!

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

జ్వరం టాబ్లెట్‌ రూ. 100

క్యాబినెట్‌ విస్తరణ ముహూర్తం కుదిరింది!

ఇకపై ఇంటర్వ్యూలు లేకుండానే ఉద్యోగాలు!

వావ్‌! లేపాక్షికి యునెస్కో గుర్తింపు!

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

ఆ 10 మందికీ మంత్రిపదవులు ఖాయం!)

మందుబాబులకు హ్యాపీ న్యూస్‌..!

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ అసలు రివ్యూ ఇదే!

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version