Home అవీఇవీ! కొంపముంచిన ప్రీ వెడ్డింగ్‌ షూట్‌.. చావుబ‌తుకుల మ‌ధ్య‌ కొత్త జంట

కొంపముంచిన ప్రీ వెడ్డింగ్‌ షూట్‌.. చావుబ‌తుకుల మ‌ధ్య‌ కొత్త జంట

0
Pre Wedding Shoot
Pre Wedding Shoot

కొంపముంచిన ప్రీ వెడ్డింగ్‌ షూట్‌.. చావుబ‌తుకుల మ‌ధ్య‌ కొత్త జంట

Pre Wedding Shoot: పెళ్లికి ముందే వధూవరులు హీరోహీరోయిన్ల తరహాలో షూటింగ్‌లో పాల్గొని, వినసొంపైన పాటలతో, చూడముచ్చటైన వీడియోను చిత్రీకరించుకున్న తర్వాతనే పెళ్లిపీటలెక్కడం ఈమధ్య ఆనవాయితీగా మారిపోయింది. రోజూ ఉదయాన్నే ప్రవచనాలు చెప్పే మహానుభావులు ఇలాంటి సంప్రదాయాలను తూర్పారబడుతున్నప్పటికీ, నేటి యువతీయువకుల్లో ఇదొక ట్రెండ్‌గా, ముచ్చటగా మారిపోయింది. ప్రీ వెడ్డింగ్‌ షూట్‌లతో వీడియో గ్రాఫర్లు, వీడియో ఎడిటర్లు మస్తుగా డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. ఇదిలావుండగా… ట్రెండ్‌గా మారిన ప్రీ వెడ్డింగ్‌ షూట్లు కాబోయే వధూవరుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ప్రీ వెడ్డింగ్‌ షూట్లలో జరుగుతున్న ప్రమాదాలతో కొన్ని జంటలు ఆసుపత్రుల పాలవుతుంటే, మరికొందరు ప్రాణాలే కోల్పోతున్నారు. కొన్ని రోజుల క్రితం బురదలో ప్రీ వెడ్డింగ్‌ ఫోటోషూట్‌ చేశారు. చివరకు ఆ జంట ప్రాణాలు అరచేతిలో పట్టుకొని బయటపడాల్సి వచ్చింది. చాలా సంఘటనలు ఇలా జరిగాయి. తాజాగా ఓ జంట ఆనందంగా షూటింగ్‌ చేసుకుంటున్న తరుణంలో తేనెటీగలు దాడిచేసి, ఒళ్లు బొబ్బలుకట్టి, కందిపోయి, చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో బెడ్‌పై వుంది. హైదరాబాద్‌ నగరంలో ఈ దారుణం జరిగింది. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో జరిగిన ఒక ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ వధూవరుల ప్రాణాల మీదకు తెచ్చింది. నిజానికి గత సోమవారమే ఈ ఘటన జరిగింది. కాకపోతే ఆ జంట ప్రాణంమీదికొచ్చేసరికి ఇది బయటకు పొక్కింది. అందుకే ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం కోహెడ గ్రామంలో గత సోమవారం ఒక ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ జరిగింది. ఈ షూట్‌లో భాగంగా మంట వెలిగించారు. దీన్నుంచి విపరీతంగా పొగ రావడంతో ఆకర్షణకు లోనైన తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ దాడి ఘటనలో పెళ్లికొడుకు, పెళ్లి కూతురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఈ జంట మలక్‌పేటలోని యశోద ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ జంట పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. మరో రెండు రోజుల్లో పెళ్లి చేసుకోవాల్సిన జంటను ఇప్పుడు ప్రీ వెడ్డింగ్‌ షూటింగ్‌ కొంపముంచింది. వధూవరులకు చెందిన కుటుంబసభ్యులు ఆసుపత్రిలోనే మకాం పెట్టాల్సి వచ్చింది. (Story: కొంపముంచిన ప్రీ వెడ్డింగ్‌ షూట్‌.. చావుబ‌తుకుల మ‌ధ్య‌ కొత్త జంట)

See Also: 

సెక్స్‌రాకెట్‌: ఇంట్లోనే దుకాణం-ఇద్దరి అరెస్ట్‌

రోహిత్‌శర్మపై వేటు?

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

అమ్మఒడికి ఆంక్షలు…పూర్తి వివరాలివే! అప్లయ్‌ చేసుకునే విధానం!

కేసీఆర్‌ నిర్ణయంతో ఆంధ్రోళ్లకు కోట్లుకోట్లు

కేజీఎఫ్‌: ఛాప్టర్‌ 2 అసలు సిసలు సమీక్ష ఇదే!

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

తూచ్‌! రాజీనామా లేఖకాదు…థ్యాంక్స్‌ లేఖ!

విజయ్‌ ‘బీస్ట్‌’ మూవీ పెర్‌ఫెక్ట్‌ రివ్యూ!

మందు తాగుతా… కథలు రాస్తా!

ఇకపై హైదరాబాద్‌ శివారు భూములు బంగారమే!

పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్‌

పింఛ‌ను డ‌బ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!

చ‌నిపోయాడ‌ని పూడిస్తే…బ‌తికొచ్చాడు!

స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : క‌ట‌క‌టాల్లో టీచ‌ర్‌

ఏపీలో పంచాయతీ నిధులన్నీ మాయం!

ఎంత దారుణం : శవంతో సెక్స్‌!

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version